వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాపు ఓట్లను పవన్ హోల్ సేల్ గా చంద్రబాబుకు అమ్ముతారు : నేస్తం- కాపు కాస్తాం : సీఎం జగన్ సంచలనం..!!

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి జగన్ విపక్ష నేత చంద్రబాబు..జనసేనాని పవన్ పైన సంచలన వ్యాఖ్యలు చేసారు. కాపుల ఓట్లను ముట గట్టి వాటిని హోల్ సేల్ కు చంద్రబాబు అమ్మేసి.. సహకరించేందుకు దత్త పుత్రుడు రాజకీయాలు చేస్తున్నారంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం కాపు నేస్తం మాత్రమే కాదని..కాపు కాస్తామంటూ ముఖ్యమంత్రి ప్రకటించారు. కాకినాడ జిల్లాలో కాపునేస్తం నిధులను సీఎం విడుదల చేసారు. సభలో సీఎం ప్రతిపక్షాల పైన ఫైర్ అయ్యారు.

చంద్రబాబు - పవన్ లక్ష్యంగా

చంద్రబాబు - పవన్ లక్ష్యంగా

చంద్రబాబు తన పాలనలో కాపులకు ఏటా వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి అయిదేళ్ల కాలంలో రూ 1500 కోట్లు కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. చంద్రబాబు చేసిన మోసాలు..చెప్పిన అబద్దాల్లో కాపులకు ఇచ్చిన హామీలు కలిసిపోయాయని ధ్వజమెత్తారు. తాము ప్రతీ కుటుంబానికి మంచి చేస్తున్నామని.. చేస్తున్న మంచిని నిజాయితీగా ప్రతీ ఇంటికి వెళ్లి చెబుతున్నామ ని సీఎం చెప్పుకొచ్చారు. దేశంలో ఎక్కడైనా ప్రజలకు చేసింది నిజాయితీగా చెప్పకొనే పాలన ఉందా అని ప్రశ్నించారు. నేడు తన విధానం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ అయితే, చంద్రాబు అండ్ కో ఆలోచన డీపీటీ అని ఎద్దేవా చేసారు. దోచుకో..పంచుకో..తినుకో అనేది చంద్రబాబు దుష్ఠచతుష్ఠయం విధామని చెప్పుకొచ్చారు. ప్రతీ ఇంట్లోనూ ఈ ప్రభుత్వం ద్వారా జరుగుతున్న మంచి గురించి చర్చ జరగాలన్నారు.

డీబీటీ కావాలా..డీపీటీ కావాలా

డీబీటీ కావాలా..డీపీటీ కావాలా


డీబీటీ కావాలా..చంద్రబాబు డీపీటీ కావాలా అనేది ఆలోచన చేయాలని సూచించారు.సామాజిక వర్గాల బాగు కావాలా... లేకపోతే చంద్రబాబు అండ్ టీం బాగుపడే పాలన కావాలా అంటూ ప్రశ్నించారు. నిజాయితీ కావాలా..లేకుంటే..మోసం..వెన్నుపోటు..అబద్దాల మార్కు చంద్రబాబు రాజకీయం కావాలా అంటూ ముఖ్యమంత్రి ప్రజలకు సూచించారు. ఏ పేదింటి కుటుంబానికి అయినా మంచి జరిగేలా పాలన అందిస్తున్నామని చెప్పారు. గుండె మీద చేతులు వేసుకొని ఆలోచించాలని సూచించారు. హుదుద్ సమయంలో తానూ తిరిగానని.. అక్కడక్కడా రేషన్ బియ్యం.. పాచిపోయిన పులిహోర ఇచ్చారని గుర్తు చేసారు. ఇప్పుడు వరద బాధితులకు ఎక్కడా సాయం అందలేదని ఏ ఒక్కరూ చెప్పటం లేదని సీఎం వివరించారు. చంద్రబాబు లాగా తనకు మీడియా..దుష్ఠచతుష్ఠయం లేదని.. తన నమ్మకం మీరేనంటూ సభికులను ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు.

నా నమ్మకం మీరే..నిజయితీగా ఆలోచించండి

నా నమ్మకం మీరే..నిజయితీగా ఆలోచించండి


ప్రతీ ఇంటికి మంచి చేశాననే నిజాయితీ ఉంది..మంచి చేసిన అక్కా చెల్లెల్ల మద్దతు ఉందనే నమ్మకం ఉందని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. కాపు నేస్తం ద్వారా ఈ రోజున 3,38,792 మంది లబ్దిదారులు ఖాతాలు లో 508 కోట్లు జమ చేసారు. తనది అక్కచెల్లెళ్ళు, రైతులు, పేదలు ప్రభుత్వంగా అభివర్ణించారు. మేనిపెస్టో లో చెప్పకపోయిన మీకు తోడుగా ఉండాలని ఈ పధకం తీసుకు వచ్చామని సీఎం వివరించారు. మూడేళ్ళ లో కాపు నేస్తం పథకానికి 1492 కోట్లు అందించాన్నారు. మూడేళ్ళలో కాపు సామాజిక వర్గానికి 16256 కోట్లు లబ్ది చేకూరిందని వివరించారు. ఇళ్ల పట్టాలు పధకం ద్వారా ద్వారా 2,46,080 కాపు మహిళలు కి12 వేలు కోట్లు లబ్ది చేకూరుందని చెప్పారు. ఈ మూడేళ్ళ లో కాపు కుటుంబాలు కి జరిగిన లబ్ది 32 వేలు కోట్లుగా ముఖ్యమంత్రి వెల్లడించారు.

English summary
CM Jagan Sensational Comments against Pawan Kalyan and Chandra Babu in Kapunestham meeting in Kakinada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X