• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒమిక్రాన్‌ నేపథ్యంలో ఏపీలో ఆంక్షలు - రెండో డోసు వచ్చే నెల పూర్తి కావాలి : ఆరోగ్య శ్రీ యాప్ - సీఎం జగన్..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏపీలో ఒక ఓమిక్రాన్ కేసు వెలుగులోకి రావటంతో ముఖ్యమంత్రి జగన్ వైద్య ఆరోగ్య శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. పలు కీలక ఆదేశాలు జారీ చేసారు. విమానాశ్రయాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేయాలని నిర్దేశించారు. కేంద్రం- ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన కోవిడ్ ప్రోటోకాల్ ను తప్పని సరి చేయాలని సీఎం ఆదేశించారు. వారం రోజుల్లో విజయవాడలో జీనో సీక్వెన్సింగ్ లాబ్ అందుబాటులోకి రానుందని అధికారులు వెల్లడించారు. వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్‌ పూర్తిచేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

వాక్సినేషన్ పూర్తి చేయాలి

వాక్సినేషన్ పూర్తి చేయాలి


కేంద్రంతో సమన్వయం చేసుకుని జవనరిలోగా నిర్దేశించిన వయస్సుల వారందరికీ కూడా డబుల్‌ డోస్‌ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. వ్యాక్సినేషన్‌ను వీలైనంత త్వరగా పూర్తిచేయడమే కోవిడ్‌నివారణలో ఉన్న పరిష్కారమన్న సీఎం..ఆ దిశగా కార్యాచరణ సిద్దం చేసుకోవాలన్నారు. నాడు - నేడు కింద చేపడుతున్న ఏ కార్యక్రమమైనా గతానికీ, ఇప్పటికీ తేడా స్పష్టంగా కనిపించాలన్నారు. కొత్త మెడికల్‌కాలేజీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు.

ఆరోగ్య శ్రీ సేవలపై అవగాహన పెంచాలి

ఆరోగ్య శ్రీ సేవలపై అవగాహన పెంచాలి

ఆరోగ్య శ్రీ సేవలు ఏ ఆస్పత్రిలో దొరుకుతాయనే విషయమై అందరికీ అవాగాహన కల్పించాలన్నారు. గ్రామ సచివాలయాల్లో దీనికి సంబంధించిన హోర్డింగ్స్‌ పెట్టాలని సూచించారు. ఆరోగ్య శ్రీ సేవలందాలంటే ఎక్కడకు వెళ్లాలన్నదానిపై వారికి అందుబాటులో సమాచారం ఉండాలన్నారు. ఏ ఆస్పత్రికి వెళ్లాలి, ఎక్కడ ఆరోగ్య శ్రీ సేవలు చేయించుకోవాలన్నదానిపై వారికి సరైన సమాచారం, మార్గదర్శకత్వం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. క్యాన్సర్‌ రోగులకు సూపర్‌స్పెషాల్టీ సేవలు అందాలని సీఎం స్పష్టం చేసారు.

ఆరోగ్య శ్రీ సేవలకు ప్రత్యేక యాప్

ఆరోగ్య శ్రీ సేవలకు ప్రత్యేక యాప్


అంతేకాకుండా క్యాన్సర్‌ రోగులకు చికిత్సలు పూర్తిస్థాయిలో ఆరోగ్య శ్రీ కింద సేవలు అందాలన్నారు. విశాఖపట్నంలో కొత్త ఎంఐఆర్‌ఐ, కాకినాడలో ఎంఐఆర్‌ఐ, కాథ్‌ల్యాబ్, కర్నూలులో క్యాథ్‌ల్యాబ్‌పపాడేరు, అరుకుల్లో అనస్తీషియా, ఆప్థాలమిక్‌ మరియు ఈఎన్‌టీ ఏర్పాటుకు సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఇందు కోసం దాదాపు రూ. 37.03 కోట్లు ఖర్చుచేయనున్నారు. సమర్థవంతంగా ఆరోగ్య శ్రీ సేవలకు ప్రత్యేక యాప్‌ తీసుకురావాలని నిర్ణయించారు.

ఆస్పత్రుల్లో సిబ్బంది నియామకం పూర్తి చేయండి

ఆస్పత్రుల్లో సిబ్బంది నియామకం పూర్తి చేయండి

ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది నియామకానికి తీసుకుంటున్న చర్యలపై వివరాలు సీఎం కోరగా..ఫిబ్రవరి చివరికల్లా మొత్తం ప్రక్రియ ముగుస్తుందన్న అధికారులు స్పష్టం చేసారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలను ప్రజలకు అందించడంలో సిబ్బంది సహకారం, భాగస్వామ్యం చాలా అవసరమన్న సీఎం..ప్రభుత్వ ఉద్దేశాలను, ప్రజలకు సేవలందించడంలో లక్ష్యాలను వారికి వివరించాలన్నారు. వారి సహకారంతో మంచి ఫలితాలు సాధించాలని అధికారులకు సీఎం జగన్ నిర్దేశించారు.

English summary
CM Jagan Key directions for officials ahead of Vomicron, must follow covid protocal. CM Suggested to complete vaccination by end of next month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X