ఇదీ నా ధైర్యం, దళారులు నాకు వద్దు: వాళ్లు చంద్రబాబు కోవర్టులు- జగన్..!!
మీ బిడ్డకు దళారులు అవసరం లేదు. మీ బిడ్డ నమ్మేదల్లా చేసిన మంచినే..అంటూ సీఎం జగన్ చెప్పుకొచ్చారు. మాచర్ల వద్ద వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.పల్నాడుకు కృష్ణమ్మ జలాలు అందించబోతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పల్నాటి సీమ రూపురేఖలను సమూలంగా మార్చే దిశగా అడుగులు వేస్తూ పల్నాడు జిల్లా మాచర్ల వద్ద వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా గత పాలకులు ప్రాజెక్టు చేపట్టారు. ప్రస్తుతం అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశాం. ఏదైనా పని చేయాలంటే పాలకులకు చిత్తశుద్ధి ఉండాలని సీఎం పేర్కొన్నారు.
కురుక్షేత్ర యుద్దం : త్వరలో కురుక్షేత్ర యుద్దం జరగనుందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. 2014లో కూడా ఇదే దత్తపుత్రుడు, చంద్రబాబుతో కలిసి పోటీ చేశాడు. కలిసే మేనిఫెస్టో విడుదల చేశారని చెప్పారు. ఇదే దత్తపుత్రుడు ఆ మేనిఫెస్టోకు నేను పూచీ అని చెప్పారని గుర్తు చేసారు. వీరు సరిపోరని మోదీని కూడా కలుపుకున్నారని విమర్శించారు. చంద్రబాబుకు ప్రజల సంక్షేమం పట్టదు. చంద్రబాబు పాలనలో మోసాలు, వెన్నుపోటు, అబద్ధాలే. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కటైనా మంచి కార్యక్రమం చేపట్టలేదు. కుప్పం ప్రజలకే నీళ్లు ఇవ్వని చంద్రబాబు ఇతర ప్రాంతాలను బాగు చేస్తారా అని ప్రశ్నించారు. తన పాలనలో ఎంతటి కష్టకాలంలోనూ అభివృద్ధి సంక్షేమాన్ని ఆపలేదని వివరించారు.

ఇదీ మన ధైర్యం : మంచి జరిగితేనే ఓటేయండని చెప్పే ధైర్యం తమదని జగన్ చెప్పుకొచ్చారు. అన్ని వర్గాలకు మంచి చేశాం కాబట్టే ధైర్యంగా ఉన్నామన్నారు. పొత్తులను తాము నమ్ముకోలేదన్నారు. తన ధైర్యం ప్రజలు.. అందుకే మధ్యలో దళారుల్ని పెట్టుకోలేదని సీఎం జగన్ పేర్కొన్నారు. తన ధైర్యం ఇంటింటికీ చేసిన మంచి, అన్ని సామాజిక వర్గాలకు, అన్ని ప్రాంతాలకు చేసిన మంచే తన ధైర్యంగా వివరించారు.
మనందరి ప్రభుత్వం బటన్ నొక్కి నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి పంపించిన రూ.2.40 లక్షల కోట్లే నా ధైర్యం అంటూ జగన్ చెప్పుకొచ్చారు. ప్రతీ వ్యవస్థలో...ప్రతీ పార్టీలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారని జగన్ వ్యాఖ్యానించారు. వీరంతా తమ పార్టీల కోసం కాకుండా చంద్రబాబు కోసం రాజకీయాలు చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేసారు.

దళారులు అవసరం లేదు : గతంలో చేసిన మోసాల తరహాలోనే మరోసారి 11 హామీలతో ప్రతిపక్షాలు మరోసారి ప్రజలను వంచించేందుకు వస్తున్నారని జగన్ అప్రమత్తం చేసారు. ఇలాంటి రాజకీయం,.పొత్తులు తనకు చేతకాదని చెప్పారు.వైఎస్సార్. జగన్ కు తెలిసింది ఒక్కటేనని..ప్రజల్లో నడవటం.గుండె చప్పుడు వింటమే..నేను విన్నాను. నేను ఉన్నాను అని చెప్పటమేనని వివరించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతీ మాటను అమలు చేస్తాడని చెప్పుకొచ్చారు.
చంద్రబాబు కుమారుడికి తెలుగులో మాట్లాడటం రాదని..ఇంగ్లీషు గురించి చెప్పే పని లేదని ఎద్దేవా చేసారు. చంద్రబాబు తన బినామీల భూముల ధరలు పెరగాలని అమరావతిని రాజధానిగా భ్రమ కలిగించారని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తి మూడు ప్రాంతాలకు సమన్యాయం చేశారా అని జగన్ ప్రశ్నించారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications