వైసీపీ వర్సస్ టీడీపీ, డేంజర్ బెల్స్ - లేటెస్ట్ సర్వేతో అలర్ట్..!!
ఏపీలో ఎన్నికల సమీకరణాలు మారుతున్నాయి. అభ్యర్దుల ఎంపిక పైన రెండు ప్రధాన పార్టీలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. వైసీపీ లో నియోకవర్గాల ఇంఛార్జ్ లను మారుస్తున్నారు. టీడీపీలో కసరత్తు మొదలైంది. టీడీపీ, జనసేన సీట్ల ఖరారు ఇప్పుడు టీడీపీ సీనియర్లలో టెన్షన్ పెంచుతోంది. ఇదే సమయంలో వైసీపీలో ఇంఛార్జ్ ల మార్పు రెండో జాబితా సిద్దం అయింది. తాజా సర్వే రిపోర్ట్ తో పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఇంతకీ ఆ సర్వేలో ఏం తేలింది.
అభ్యర్దుల ఎంపిక : ఏపీలో ఎన్నికల సమరాన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. సీఎం జగన్ తిరిగి అధికారం దక్కించుకోవటమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్నారు. అదే సమయం లో జగన్ ఓటమే లక్ష్యంగా టీడీపీ -జనసేన కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. బీజేపీ వైఖరి పైన స్పష్టత రావాల్సి ఉంది. జగన్ ప్రభుత్వం పైన వ్యతిరేకత..తమ పొత్తు అధికారానికి దగ్గర చేస్తుందని ఆ రెండు పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఇదే సమయంలో జగన్ ఇంఛార్జ్ ల మార్పుతో తలెత్తే సమస్యలు..అసంతృప్తులు ఎన్నికలకు ముందే పరిష్కారానికి వీలుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. త్వరలోనే మరో 27 నియోజకవర్గాలకు ఇంఛార్జ్ ల మార్పు ఖాయంగా కనిపిస్తోంది.

గెలుపే ప్రామాణికం : నేతల కంటే పార్టీ గెలుపు కీలకమని జగన్ తేల్చి చెబుతున్నారు. ఎవరినీ వదులుకోనని..గెలుపే ప్రామణికంగా అభ్యర్దుల ఎంపిక ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం తప్పించిన వారికి ఖచ్చితంగా భవిష్యత్ లో ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇస్తున్నారు. తాజా సర్వే ఏపీలో ఏ పార్టీ ఏ స్థానంలో ఉందనేది తేల్చింది. తాజా సర్వే ప్రకారం వైసీపీకి 50.10 ఓట్ల శాతం దక్కుతుందని తేల్చారు. అదే విధంగా టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే దక్కేది 43.12 శాతంగా విశ్లేషించారు. బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలకు 2.08 శాతం గా అంచనా వేసారు. ఇక..ఎటూ తేల్చని ఓటర్ల శాతం 4.70 గా ఉంది. ఈ లెక్కన వైసీపీకి 113-118 స్థానాలు దక్కించుకుంటుందని విశ్లేషించారు. అయితే, వైసీపీకి అనుకూలంగా రిపోర్టు ఇస్తూనే నియోజకవర్గాల వారీగా అలర్ట్ చేసినట్లు తెలుస్తోంది.

మారుతున్న లెక్కలు : ముఖ్యమంత్రి జగన్ ఐ ప్యాక్ తో పాటుగా పలు కోణాల్లో క్షేత్ర స్థాయి సమాచారం సేకరిస్తున్నారు. ఏ ఒక్క నియోకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే లేదా ఇంఛార్జ్ కు సానుకూలత లేదని తెలిసినా..నిర్మొహమాటంగా మార్చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో ప్రస్తుత కేబినెట్ లో ముగ్గురు మంత్రులకు సీట్లు మార్చిన జగన్.. మరో నలుగురు మంత్రులను ఎంపీలుగా పంపేందుకు సిద్దం అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎంపీలు ముగ్గురు ఎమ్మెల్యేలుగా పోటీ చేయనున్నారు. మరో 12 మందితో రెండో విడత నియోకవర్గ ఇంఛార్జ్ లపైన ప్రకటనకు రంగం సిద్దం అయినట్లు సమాచారం. అటు టీడీపీలోనూ సీనియర్ల స్థానాల్లోనూ కొన్ని జనసేకు ఖాయంగా కనిపిస్తున్నాయి. దీంతో..ఇప్పుడు అభ్యర్దుల ఎంపిక వేళ ఏపీలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!!












Click it and Unblock the Notifications