జన్మదినం వేళ సీఎం జగన్ గిఫ్ట్..!!
ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ జన్మదినం. పార్టీ శ్రేణులు సెల్రబేషన్స్ గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. తన జన్మదినం నాడు సీఎం జగన్ విద్యార్దులతో మమేకం కావాలని నిర్ణయించారు. ఇదే రోజున మరో కార్యక్రమం ప్రారంభించనాున్నారు. 8వ తరగతి చదువుతున్న 4,34,185 మంది విద్యార్థులకు 620 కోట్ల వ్యయంతో బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ తో కూడిన ట్యాబ్ లు ఉచితంగా పంపిణీ ప్రారంభించనున్నారు. చింతపల్లిలో ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొంటున్నారు.
ఉచిత ట్యాబ్ లు: ఏపీలో అమలు చేస్తున్న విద్యా సంస్కరణల్లో భాగంగా విద్యార్ధులకు సీఎం జగన్ ఉచిత ట్యాబ్ లు అందిస్తున్నారు. దాదాపు 17,500కు పైగా మార్కెట్ విలువ గల ట్యాబ్ దాదాపు 15,500 విలువ గల బైజూస్ కంటెంట్ తో కలిపి ప్రతి 8వ తరగతి విద్యార్థికి రూ. 33,000 లబ్ధి చేకూరనుంది..

8వ తరగతి విద్యార్థులు పై తరగతులకు వెళ్లినప్పుడు కూడా ఉపయోగపడేలా 8వ తరగతితో పాటు 9,10 తరగతుల బైజూస్ కంటెంట్ లోడ్ చేసి ట్యాబ్ లు అందజేస్తున్నారు. ఇప్పుడు అందించే ట్యాబ్ లలో 11,12 తరగతుల కంటెంట్ కూడా లోడ్ చేసేలా ట్యాబ్ మెమరీ కార్డ్ సామర్థ్యం 256జీబీ కి పెంచి పంపిణీ చేయనున్నారు.
కంటెంట్ తో పాటుగా: 4 నుండి 10వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి ఉచితంగా అందిస్తున్న 15,500 విలువైన బైజూస్ కంటెంట్ ఇక 11, 12వ తరగతులకు కూడా అందుబాటులో ఉండనుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, ఇంగ్లీష్, టోఫెల్ ప్రిపరేషన్లో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు వీలుగా అన్ని ట్యాబ్ ల్లో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బాట్ (డౌట్ క్లియరెన్స్ బాట్) అప్లికేషన్.. పిల్లలు సులభంగా విదేశీ భాషలు నేర్చుకుని అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి పొందేందుకు వీలుగా డ్యులింగో ఇన్ స్టాల్ చేసారు.
ట్యాబ్ లలో అవాంఛనీయ సైట్లు, యాప్స్ ను నిరోధించే ప్రత్యేక సాఫ్ట్ వేర్ వుంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్.. 45 వేల స్మార్ట్ టీవీలు ఇవ్వనున్నారు.

డిజిటల్ విద్యా బోధన: ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులు స్పోకెన్ ఇంగ్లీష్ లో నైపుణ్యం సాధించేలా ఈ ఏడాది ఇప్పటికే టోఫెల్ను ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టిన ఏపి ప్రభుత్వం.. 3వ తరగతి నుంచే తర్ఫీదు ఇస్తూ ప్రతి స్కూల్లో టోఫెల్ పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్ అందచేసింది.. ఈ మేరకు ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఇచ్చేలా అమెరికన్ సంస్థ ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ (ఈటీఎస్) తో ఒప్పందం కుడా కుదుర్చుకుంది.
ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదులకు డిజిటల్ మౌలిక వసతులు మరింత మెరుగుపరుస్తూ రాష్ట్రవాప్తంగా దాదాపు 45వేల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఫైబర్/ బ్రాడ్ బాండ్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.












Click it and Unblock the Notifications