Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో ఎన్నికల ఫలితం ముందే తేలిపోనుందా - రేపే ముహూర్తం..!!

ఏపీలో ఈ సారి ఎన్నికల సమరం హోరా హోరీగా మారుతోంది. అధికారం నిలబెట్టుకొనేందుకు సీఎం జగన్ అన్ని అస్త్రాలను సంధిస్తున్నారు. టీడీపీ, జనసేన సీఎం జగన్ ఓటమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. కాంగ్రెస్ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. బీజేపీ రాజకీయం పైన ఇంకా స్పష్టత రావటం లేదు. ఈ సమయంలో గోదావరి జిల్లాలో అధికారం డిసైడ్ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. అక్కడే ఇప్పుడు సీఎం జగన్ గురి పెట్టారు.

రెండు జిల్లాలే కీలకం : ఏపీలో ఎవరు అధికారంలోకి రావాలన్నా గోదావరి జిల్లాలే కీలకం. ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లో మెజార్టీ సీట్లు సాధించిన వారికి అధికారం ఖాయమనే అభిప్రాయం ఉంది. 2014లో పశ్చిమలో టీడీపీ, జనసేన, బీజేపీ క్లీన్ స్వీప్ చేసాయి. తూర్పు గోదావరిలో వైసీపీకి నాలుగు స్థానాలే దక్కాయి. దీంతో ఆ ఎన్నికల్లో గెలిచి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరిలో టీడీపీ 2, తూర్పుగోదావరిలో టీడీపీ 4 గెలవగా, జనసేన ఒక్క స్థానం గెలిచాయి. మొత్తం 34 స్థానాల్లో వైసీపీ 27 స్థానాలు గెలిచి అధికారం దక్కించుకుంది. దీంతో, గోదావరి జిల్లాల్లో సామాజిక సమీకరణాలు కీలకంగా మారుతున్నాయి. కాపు, బీసీ, ఎస్సీ, క్షత్రియ వర్గాల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. పవన్ మద్దతుతో మెజార్టీ కాపు వర్గం తమ వైపు ఉంటుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు.

CM Jagan to make key Announcemetns in Eluru Siddam meeting ahead Assembly Elections

పొత్తుల లెక్కలు : ఇదే సమయంలో కాపులతో సమానంగా ఉన్న బీసీ ఓట్ బ్యాంక్ ను తన వైపు తిప్పుకొనేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. కాపు-బీసీ సమీకరణాల్లో సీట్లు ఖరారు చేస్తున్నారు. టీడీపీ - జనసేన నుంచి ఈ రెండు జిల్లాల్లో సీట్ల కోసం పోటీ ఎక్కువగా ఉంది. ఈ సమయంలోనే పశ్చిమ గోదావరి కేంద్రంగా సీఎం జగన్ భారీ ఎన్నికల సభలో పాల్గొంటున్నారు. భీమిలి కంటే మరింతగా జన సమీకరణకు స్థానిక నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ శ్రేణులందరి దగ్గరకు వచ్చి అభివాదం చేసేందుకు వీలుగా పార్టీ గుర్తయిన 'ఫ్యాన్‌' ఆకారంలో భారీ వాక్‌వేను ఏర్పాటు చేశారు. 110 ఎకరాల్లో జరిగే సభకు లక్షలాది మంది తరలిరానున్నారని గోదావరి జిల్లాల వైసీపీ నేతలు చెబుతున్నారు. మధ్నాహ్నం 3.30 గంటలకు సీఎం జగన్ సభా ప్రాంగణానికి చేరుకుని 4.55 గంటలకు సభ ముగిస్తారు.
CM Jagan to make key Announcemetns in Eluru Siddam meeting ahead Assembly Elections

బలం చూపిస్తారా : ఇప్పటికే గోదావరి జిల్లాల్లో పవన్ కల్యాణ్ వారిహి యాత్ర ద్వారా తన ఓట్ బ్యాంక్ పెంచుకొనే ప్రయత్నం చేసారు. చంద్రబాబు ఉభయ గోదావరి జిల్లాల్లో పలు సభల్లో పాల్గొన్నారు. తాజాగా రెండు గోదావరి జిల్లాల్లోనూ పలు నియోజకవర్గాల్లో సీఎం జగన్ తన పార్టీ అభ్యర్దులను మార్పు చేసారు. ఈ సమయంలో టీడీపీ, జనసేన వచ్చే ఎన్నికల్లో తమ కంచుకోటగా భావిస్తున్న గోదావరి జిల్లాల్లో జరిగే సభను వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ సభ ద్వారా జగన్ స్థానిక అంశాల పైన స్పందిస్తారని..తిరిగి అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నారనేది స్పష్టత ఇస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో, గోదావరి జిల్లాలో వైసీపీ నిర్వహిస్తున్న సిద్దం సభ పైన ఆసక్తి నెలకొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+