సీఎం జగన్ గుడ్ న్యూస్ - ఒకేసారి రెండు పథకాల నిధులు, ముహూర్తం ఫిక్స్..!!

ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ అభ్యర్దుల ఎంపిక కసరత్తు వేగవంతం చేసారు. ఇప్పుడు సంక్షేమ పథకాల అమల్లోనూ వేగం పెంచారు. ఫిబ్రవరి నెలాఖరులో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందనే అంచనాలతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. దాదాపు కోటి పది లక్షల మంది మహిళలకు సంబంధించిన రెండు ప్రధాన సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు చేసారు.

పథకాల అమలు : ఎన్నికల వ్యూహాల్లో భాగంగా సంక్షేమ పథకాల అమలుకు జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నెలలోనే గతంలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్ పెన్షన్ రూ 3 వేలకు పెంచి అమలు చేస్తున్నారు. దాదాపు 67 లక్షల మందికి పెంచిన పెన్షన్ అందిస్తున్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో నెలకు రూ 1,950 కోట్లు కేవలం పెన్షన్ల కోసం ఖర్చు చేస్తున్నారు. ఇక, ఇదే నెలలో మరో ముఖ్యమైన పథకం అమలుకు ముహూర్తం ఖరారు చేసారు. పొదుపు సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు అమలు చేస్తున్న వైఎస్సార్ ఆసరా నాలుగో విడత ఈ నెల 23వ తేదీ నుంచి 31వరకు అమలు ముహూర్తంగా నిర్ణయించారు. వైఎస్సార్ ఆసరా ద్వారా ఇప్పటికే రూ 19,195 కోట్లు అందించారు. మూడు విడతలుగా ఈ నిధులు విడుదల చేసారు.

CM Jagan to release YSR Asara funds on 23rd january and Cheyutha funds on Feb 5th

ముహూర్తం ఖరారు : వైఎస్సార్ ఆసరా పథకం లబ్దిదారుల సంఖ్య 78.94 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఈ ఒక్క ఆసరా పధకం ద్వారా మొత్తం రూ 25,570 కోట్ల మేర లబ్ది అందుతోంది. ఇదే తరహాలో మరో ప్రతిష్ఠాత్మక పథకం వైఎస్సార్ చేయూత అమలుకు తేదీ ఖరారు చేసారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో అట్టడుకు వర్గాల్లో వారికి తోడుగా నిలిచేందుకు ఈ పథకం అమలు చేస్తున్నారు. 45 ఏళ్ల పైబడ్డ ఉన్న మహిళలకు ఏడాదికి రూ.18,750లు అందించారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద రూ 14,129 కోట్లు విడుదల చేసారు. 2639 లక్షల మంది మహిళలు ఈ పథకంలో లబ్దిదారులుగా ఉన్నారు. చివరి విడగా ఫిబ్రవరి 5 నుంచి 14వ తేదీ వరకు అమలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో అర్హత ఉండీ, ఏ కారణంతో అయినా అందని లబ్దిదారులు ఉంటే వారికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ప్రతీ ఆరు నెలలకు వారికి లబ్ది అందించేలా నిర్ణయం అమలు చేస్తోంది.

CM Jagan to release YSR Asara funds on 23rd january and Cheyutha funds on Feb 5th

గేమ్ ఛేంజర్ : ఈ సారి చేయూత పథకం అమలు సమయంలోనే లబ్దిదారులకు సీఎం జగన్ రాసిన లేఖను అందించనున్నారు. ఈ రెండు నెలల కాలంలో పెన్షన్ల ద్వారా 67 లక్షల మంది అవ్వా తాతలకు అందుతోంది. ఇక, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత ద్వారా దాదాపు కోటి 10 లక్షల మంది మహిళల ఖాతాల్లో వరుసగా నిధులు జమ చేయనున్నారు. తాను అమలు చేసిన సంక్షేమం - సామాజిక న్యాయం తనను గెలిపిస్తుంది అనే నమ్మకంతో జగన్ ఉన్నారు. ఫిబ్రవరిలో మేనిఫెస్టో రూపకల్పనతో పాటుగా ఇక ఎన్నికల ప్రచారం ప్రారంభించాలనేది సీఎం జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. కొత్తగా ఖరారు చేస్తున్న అభ్యర్దులు ప్రజల్లోనే ఉండాలని సూచిస్తున్నారు. దీంతో, హోరా హోరీగా మారుతున్న ఎన్నికల ప్రచారం వేళ వరుస సంక్షేమ పథకాల అమలు గేమ్ ఛేంజర్ గా మారనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+