స‌భ‌లో ఆవేశంతో ఊగిపోయిన సీఎం: బాబు..అచ్చెన్న‌కు హెచ్చరిక‌: పెద్ద క‌ళ్లు చేస్తే నేను భ‌య‌ప‌డ‌తానా..!

Recommended Video

    స‌భ‌లో ఆవేశంతో ఊగిపోయిన సీఎం జగన్ || Jagan Fires On Opposition Leaders Chandra Babu And Acham Naidu

    ఏపీ శాస‌న‌స‌భ‌లో అధికార‌- ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరింది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్ర‌సంగిస్తున్న స‌మ యంలో టీడీపీ స‌భ్యులు అడ్డు రావ‌టంతో సీఎం ఒక్క సారిగా ఆవేశంతో ఊగిపోయారు. చంద్ర‌బాబు..అచ్చెన్నా యుడు పైన సీరియ‌స్ అయ్యారు. పెద్ద క‌ళ్లు చేసుకొని చూస్తే నేను భ‌య‌ప‌డ‌తానా అంటూ చంద్ర‌బాబు మీద సీరియ‌స్ అయ్యారు. మీరు ప‌దే ప‌దే అడ్డు ప‌డితే మా వాళ్లు 151 మంది ఉన్నారు. వారు లేస్తే మీరు సీట్ల‌లో కూడా కూర్చోలేరు అంటూ మండి ప‌డ్డారు. ఆ స‌మ‌యంలో వైసీపీ స‌భ్యులు డౌన్ డౌన్ చంద్ర‌బాబు అంటూ నినాదాలు చేసారు. టీడీపీ స‌భ్యుల ప్ర‌వ‌ర్త‌న మీద ముఖ్య‌మంత్రి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు.

    ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఆగ్ర‌హంతో...

    ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఆగ్ర‌హంతో...

    సున్నా వ‌డ్డీ ప‌ధ‌కం మీద ముఖ్య‌మంత్రి స‌మాధానం ఇస్తున్న స‌మ‌యంలో..టీడీపీ నేత‌లు మ‌ధ్య‌లో అడ్డు త‌గిలారు. దీంతో..ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ గ‌తంలో ఉన్న‌డూ లేని విధంగా ఆవేశంతో ఊగిపోయారు. ఎప్పుడూ న‌వ్వుతూ క‌నిపించే జ‌గ‌న్..ఎప్పుడూ లేని విధంగా తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ముఖ్య‌మంత్రి మాట్లాడుతుంటే ఇలా అడ్డుప‌డుతున్నారు .. మేము 151 మంది ఉన్నాం..మీ లాగా మేము కూడా చేస్తే మీరు సీట్ల‌లో కూడా కూర్చోలేర‌ని హెచ్చ‌రించారు. టీడీపీ డిప్యూటీ లీడ‌ర్ అచ్చెన్నాయుడు తీరు పైన సీఎం ఫైర్ అయ్యారు. అచ్చెన్నాయుడు చేయి చూపిస్తూ మాట్లాడ‌టం పైన సీరియ‌స్ అయిన సీఎం.. శ‌రీరం పెర‌గ‌టం కాద‌య్యా..బుర్ర పెర‌గాలి అంటూ సీరియ‌స్ అయ్యారు. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు పైనా జ‌గ‌న్ మండిప‌డ్డారు. మీరు క‌ళ్లు పెద్ద‌వి చూస్తే నేను ఇక్క‌డ భ‌య‌ప‌డ‌తానా అని గ‌ట్టిగా ప్ర‌శ్నించారు. ఏమ‌య్యా..ఏమ‌య్యా అంటూ సీఎం..టీడీపీ స‌భ్యుల మీద మండిప‌డ్డారు. ఏం ప్ర‌వ‌ర్త‌న మీది అంటూ చికాకు ప్ర‌ద‌ర్శించారు. ఆ స‌మ‌యంలో వైసీపీ స‌భ్యులు చంద్ర‌బాబు డౌన్ డౌన్ అంటూ నినాదా లు చేసారు.

    ప‌ర్చూరు అనుకుంటున్నావా..రౌడీల‌ను తెచ్చారు..

    ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మాట్లాడ‌తున్న స‌మ‌యంలో ప‌ర్చూరు ఎమ్మెల్యే సాంబ‌శివరావు అడ్డు త‌గ‌ల‌టంతో జ‌గ‌న్ మ‌రో సారి సీరియ‌స్‌గా స్పందించారు. ఏంట‌య్య బెదిరిస్తున్నావు..ఏమ‌నుకుంటున్నావు..ప‌ర్చూరు అనుకుంటున్నావా.. ఎటువంటి వాళ్ల‌ను స‌భ‌లోకి తీసుకొచ్చారు..రౌడీల‌ను..గూండాల‌ను స‌భ‌లోకి తీసుకొచ్చారు అంటూ జ‌గ‌న్ సీరియ‌స్ అయ్యారు. ఇంత‌లో మంత్రి బొత్సా..సీనియ‌ర్ నేత అంబ‌టి రాంబాబు జోక్యం చేసుకొని టీడీపీ స‌భ్యులు ఇప్ప‌టికైనా ప్ర‌జ‌లు త‌మ‌కు వ‌చ్చిన తీర్పు గౌర‌వించి న‌డుచుకోవాల‌ని సూచించారు. రైతుల‌ను ఎలా మోసం చేసారో బ‌ట్ట‌లు విప్పి నిల‌బెట్టేందుకే ఈ విధంగా టీడీపీ సున్నా వ‌డ్డీ కింద ఎంత చెల్లించిందీ వివ‌రించార‌ని వైసీపీ నేత‌లు వివ‌రించారు. ఈ స‌మ‌యంలో చంద్ర‌బాబు మీద కూడా జ‌గ‌న్ గ‌ట్టిగానే స్పందించారు.

    చంద్ర‌బాబు ఇంక సీఎం అనుకుంటున్నారు..

    చంద్ర‌బాబు ఇంక సీఎం అనుకుంటున్నారు..

    ప్ర‌తిప‌క్ష నేత అనే విష‌యం మ‌రిచి చంద్ర‌బాబు త‌న‌ను తాను ఇంకా ముఖ్య‌మంత్రి అనుకుంటున్నారంటూ సీఎం జ‌గ‌న్ ఫైర్ అయ్యారు. ఇక‌, సున్నా వ‌డ్డీ విష‌యంలో రైతుల‌ను ఎలా మోసం చేసారో..అదే విధంగా డ్వాక్రా మ‌హిళ‌ల‌ను మోసం చేసార‌ని లెక్క‌లు స‌భ ముందు ఉంచారు. సున్నా వ‌డ్డీ ప‌ధ‌కం ఉంటే అది మొత్తం ఇవ్వాల్సి ఉంటే ఇవ్వ‌క పోతే ఇచ్చార‌ని అంటారా..ఇవ్వ‌లేద‌ని అంటారా చెప్పండి అని ప్ర‌శ్నించారు. ప‌ధ‌కాలు ఉన్నాయ‌ని..రైతుల‌కు మేలు చేసామ‌ని చెప్ప‌టం స‌రి కాద‌ని సూచించారు. స‌భ‌లో రౌడీయిజం చేస్తే స‌హించ‌మ‌ని తేల్చి చెప్పారు. రైతుల‌ను.. డ్వాక్రా మ‌హిళ‌ల‌ను అయిదేళ్ల పాటు ఎలా మోసం చేసారో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వివ‌రించారు. అయితే టీడీపీ స‌భ్యులు మాత్రం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌నంత‌ట తానుగా ఇబ్బందుల్లో చిక్కుకున్నారంటూ ప్ర‌చారం మొద‌లు పెట్టారు. స‌భ‌లో తొలి రోజు చేసిన స‌వాల్ మీద నిల‌బ‌డ‌లేక‌పోయార‌ని వ్యాఖ్యానిస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+