జగన్ కేబినెట్ లో కొనసాగేదెవరు - కొత్తగా వీరికే ఛాన్స్ : సీఎం లెక్కలు - జిల్లాల వారీగా..!!
ఏపీలో మంత్రివర్గ విస్తరణ గురించి స్వయంగా సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణ జరగబోతోందని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కొందరిని సామాజిక సమీకరణాల్లో భాగంగా కొనసాగించాల్సి ఉంటుందని స్పష్టం చేసారు. అదే సమయంలో మంత్రి పదవులు కోల్పోయే వారికి పార్టీ జిల్లా ఇన్ ఛార్జ్ పదవులు అప్పగిస్తామని వెల్లడించారు.
Recommended Video
తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత మరలా మంత్రులుగా అవుతారని వారికి అభయం ఇచ్చారు. అయితే, సామాజిక సమీకరణాల కారణంగా కొందరిని కొనసాగించాల్సి రావచ్చంటూ సీఎం చెప్పటంతో... ఎవరిని కొనసాగిస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. సీనియర్లు అనే ఈక్వేషన్ కంటే..సామాజిక వర్గాల సమీకరణాలకే సీఎం ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది.

సీనియార్టీ కంటే సామాజిక సమీకరణాలే కీలకం
అందునా సామాజిక వర్గంతో పాటుగా సమర్ధతే కీలకంగా మారనుంది. అందులో భాగంగా.. కొత్త జిల్లాలు ఏర్పడనుండటంతో.. జిల్లా వారీగా సమీకరణాలను ప్రాధాన్యత ఇవ్వనున్నారు. దీంతో.. పెద్దిరెడ్డి.. బుగ్గన.. పేర్ని నాని....కొడాలి నాని కొనసాగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక, సీఎం కొత్తగా మంత్రి పదవుల కోసం ఆశావాహుల సంఖ్య భారీగా ఉందన్నారు.
జిల్లాల వారీగా ఇప్పటికే సమీకరణాల ఆధారంగా ఒక లిస్టు సిద్దం అయిందని సమాచారం. ఆ జాబితాలో..శ్రీకాకుళం జిల్లా నుండి ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారాం మంత్రి పదవి ఆశిస్తున్నారు. అదే విధంగా ధర్మాన క్రిష్ణదాస్ స్థానంలో సోదరుడు ధర్మాన ప్రసాదరావు కు ఖాయమని చెబుతున్నారు. విజయనగరం జిల్లాలో కొత్తగా కోలగట్ల వీరభద్రస్వామి.. పీడిక రాజన్నదొర రేసులో ముందున్నారు. అయితే, ఎస్టీ మహిళకు అవకాశం ఇవ్వాలని భావిస్తే రాజన్న దొరకు ఛాన్స్ కష్టమే.

టార్గెట్ 2024 కు అవసరమైనట్లుగా
విశాఖ జిల్లా నుండి గుడివాడ అమర్‌నాథ్, కరణం ధర్మశ్రీ, ముత్యాల నాయుడు పేర్లు వినిపిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా నుండి ఇప్పుడున్న ముగ్గురు స్థానంలో కొత్త ముగ్గురికి ఛాన్స్ దక్కనుంది. దాడిశెట్టి రాజా మంత్రి పదవిని కోరుకుంటున్నారు. కన్నబాబు స్థానం ఆయనతో భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ జిల్లా నుంచి ఎస్సీ కోటా నుంచి ఒకరికి అవకాశం కల్పించాల్సి ఉంటుంది.
అయితే, ఎస్సీ వర్గానికి చెందిన ఎమ్మెల్సీకి దక్కే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. బీసీ వర్గానికి ఇక్కడ ప్రాతినిధ్యం కల్పించాలి. దీంతో..ముమ్మడివరం ఎమ్మెల్యే సతీష్ కు ఖాయమని ప్రచారం సాగుతోంది. పశ్చిమగోదావరిలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. రాజకీయంగా ఉభయ గోదావరి జిల్లాలు కీలకం కావటంతో ఈ జిల్లా నుంచి ఎస్సీ-క్షత్రియ-కాపు వర్గానికి అవకాశం దక్కనుంది. క్షత్రియ కోటాలో ముదునూరి ప్రసాద రాజు... కాపు వర్గం నుంచి కొట్టు సత్యానారాయణ లేదా గ్రంధి శ్రీనివాస్ పేర్లు రేసులో ఉన్నాయి. ఎస్సీ వర్గం నుంచి తలారి లేదా ఎమ్మెల్సీకి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది.

అమరావతి ప్రభావిత ప్రాంతాల నుంచి
కృష్ణా జిల్లాలో కొలుసు పార్థసారధి కి ఖాయమని తెలుస్తోంది. కమ్మ వర్గానికి చెందిన కొడాలి నానిని కొనసాగిస్తారని భావిస్తున్నారు. ఆయనను మారిస్తే ఎమ్మెల్సీ తలశిల రఘరాంకు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. అదే కోటాలో వసంత క్రిష్ణ ప్రసాద్ సైతం రేసులో ఉన్నారు. ఇక, క్రిష్ణా జిల్లా నుంచి సామినేని ఉదయభాను..మల్లాది విష్ణు.. జోగి రమేష్.మేకా వెంకట ప్రతాప అప్పారావు కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు. గుంటూరు జిల్లా నుంచి మంగళగిరి నియోజకవర్గం అమరావతి పరిధిలో ఉంది.
అక్కడ నుంచి లోకేష్ వచ్చే ఎన్నికల్లో నూ పోటీకి దిగనున్నారు. ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్సీ అయిన మురుగుడు హనుమంతరావు కు చేనేత వర్గానికి ప్రాధన్యతలో భాగంగా మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. ఇదే జిల్లా నుంచి డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, విడదల రజని, ముస్లిం మైనార్టీ నుండి మహ్మద్ ముస్తఫా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. కాపు కోటా లో అంబటి రాంబాబు ప్రధాన రేసులో ఉన్నారు.

సీమలో పట్టు కొనసాగాలంటే..
ప్రకాశం జిల్లా నుండి గతంలో పట్టణాభివృద్దిశాఖ మంత్రిగా చేసిన మహీధర్‌రెడ్డి పేరు వినిపిస్తోంది. అన్నా రాంబాబు కూడా సీటు కోరుతున్నారు. నెల్లూరు నుండి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఆనం రామ నారాయణరెడ్డి , ఎస్‌సి కోటాలో కిలివేటి సంజీవయ్య మంత్రి పదవి రేసులో ఉన్నారు. అయితే, మేకపాటి కుటుంబానికి ఇక్కడ కేబినెట్ సీటు ఖాయమని చెబుతున్నారు. దీంతో.. మరో రెడ్డి నేతకు అవకాశం కష్టమే. చిత్తూరు జిల్లా నుండి రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి బరిలో ఉన్నారు.
కడప నుండి కొరుముట్ల శ్రీనివాసులు..శ్రీకాంత్ రెడ్డి ప్రముఖంగా రేసులో ఉన్నారు. అయితే, సీ రామచంద్రయ్య సామాజిక వర్గం కోణంలో ప్రధానంగా రేసులో నిలిచారు. అనంతపురం జిల్లాలో అనంత వెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఉండగా... మహిళా కోటాలో ఉషశ్రీచరణ్, జనులగడ్డ పద్మావతి, ఎస్‌సి కోటాలో తిప్పేస్వామి పోటీపడుతున్నారు.

15న ఎమ్మెల్యేల సమావేశంలో స్పష్టత
కర్నూలు నుండి శిల్పా చక్రపాణిరెడ్డి పేరు వినిపిస్తోంది. అయితే, ప్రస్తుతం ఏపీలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో బుగ్గనను కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. ఇకక్కడ బీసీ వర్గానికి ఈ జిల్లా నుంచి అవకాశం దక్కనుంది. మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ..సామాజిక సమీకరణాలు - జిల్లాల లెక్కలు...వచ్చే ఎన్నికలు..ప్రతిపక్షాల బలం వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని సీఎం జగన్ తన ఎన్నికల కేబినెట్ ను డిసైడ్ చేయనున్నారు.
దీంతో.. కేబినెట్ కూర్పులో జగన్ చివరకు ఎవరికి అవకాశం కల్పిస్తారనేది ఇప్పుడు పార్టీ ఎమ్మెల్యేల్లో ఉత్కంఠకు కారణమైంది. ఈ నెల 15న జరిగే పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో దీని పైన సంకేతాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications