మోడీ ప్రమాణస్వీకారానికి జగన్, కేసీఆర్ డుమ్మా.. కారణమేంటంటే..
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లు సాయంత్రం జరగనున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రమాణ హజరుకాలేకపోతున్నారు. ఢిల్లీలో ఇద్దరు వెళ్లే ప్రత్యేక విమానానికి అనుమతి లేకపోవడంతో వారి పర్యటన రద్దు చేసుకున్నారు.. కాగా ఇద్దరు సీఎం కలిసి వెళ్లే ప్రత్యేక విమానం డీజీసీఎ షెడ్యుల్‌లో లేకపోవడంతో విమానయాన శాఖ అనుమతిని రద్దు చేసింది. దీంతో ఇద్దరు నేతలు ప్రమాణ స్వీకారానికి హజరు కావడం లేదు.

విజయవాడలో సీఎం జగన్ ప్రమాణ స్వీకారం తర్వాత ఆయనతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళతారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లాల్సి ఉంది. కాని ప్రత్యేక విమానం అనుమతి లేకపోవడంతో ఢిల్లీ ప్రయాణం రద్దు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications