బీఆర్ఎస్ లో కీలక నియమకాలు ప్రకటించిన సీఎం కేసీఆర్..!!
బీఆర్ఎస్ విస్తరణ పై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
బీఆర్ఎస్ విస్తరణ పై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా పొరుగు రాష్ట్రాల్లొ పార్టీ బాధ్యతలను నేతలకు అప్పగిస్తున్నారు. ఇటీవలే మహారాష్ట్ర బీఆర్‌ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా మానిక్ కదమ్‌ను నియమించిన పార్టీ అధినేత, సీఎం కేసీఆర్.. తాజాగా ఆ రాష్ట్ర డివిజన్ కోఆర్డినేటర్లను నియమించారు. నాందేడ్ లో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ మహారాష్ట్రలో తన రాజకీయ లక్ష్యాన్ని స్పష్టం చేసారు. ఆ రాష్ట్రం నుంచి పార్టీలో చేరిన నేతలకు ఇప్పుడు డివిజన్ల వారీగా బాధ్యతలను ఖరారు చేసారు. అదే సమయంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి నియామకం పైన కేసీఆర్ తాజాగా నిర్ణయం ప్రకటించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ విస్తరణ పైన ఫోకస్ చేసారు. ఇటు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం అవుతూనే పార్టీని పొరుగు రాష్ట్రాల్లో నిర్మాణం చేయటం పైన కసతరత్తు చేస్తున్నారు. కీలక నియామకాలను పూర్తి చేస్తున్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో బీఆర్‌ఎస్ పార్టీ ముందుకు పోతున్నది. అందులో భాగంగా..తీయ స్థాయిలో కిసాన్ సెల్ అధ్యక్షుడిగా జాతీయ రైతు సంఘం నేత గుర్నాంసింగ్ చడూనీని నియమించారు. తాజాగా మహారాష్ట్ర బీఆర్‌ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా మాణిక్ కదమ్‌ను నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా హిమాన్షు తివారీకి బాధ్యతలు అప్పగిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం ప్రకటించారు.

మహారాష్ట్ర పైన కేసీఆర్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అక్కడ డివిజన్ కోఆర్డినేటర్లను ఖరారు చేసారు. నాసిక్ డివిజన్ కు దశరథ సావంత్ , పుణె డివిజన్‌కు బాలసాహెబ్ జైరాం దేశ్‌ముఖ్, ముంబై డివిజన్‌కు విజయ్ తనాజి మోహితే ను నియమించారు. ఔరంగాబాద్ డివిజన్‌కుసోమ్‌నాథ్ థోరట్, నాగ్‌పూర్ డివిజన్‌కు ద్యానేష్ వాకుడ్‌కర్ ను నియమించిన కేసీఆర్ అమరావతి డివిజన్‌కునిఖిల్ దేశ్‌ముఖ్‌ను కోఆర్డినేటర్లుగా నియమించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని నాందేడ్ సభ వేదికగా కేసీఆర్ ప్రకటించారు. ఎవరితో కలిసి వెళ్తామన్నదానిపూ క్లారిటీ ఇవ్వని కేసీఆర్ అన్ని నియోజకవర్గాల్లో మాత్రం పోటీ చేస్తామని మాత్రం స్పష్టం చేశారు. గ్రామ కమిటీలు కూడా నియమిస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో మహారాష్ట్ర అంతటా పర్యటిస్తానని కేసీఆర్ తెలిపారు. వచ్చే జిల్లా పరిషత్ ఎన్నికల్లో మరాఠా ప్రజలు బీఆర్ఎస్‌ను గెలిపించాలని కోరారు. అందులో భాగంగానే ముందుగా అక్కడ పార్టీ నియామకాలను పూర్తి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications