3వ వన్డేకి అతిథిగా కెసిఆర్: విద్యాసాగర్‌కి సన్మానం
హైదరాబాద్: భారత్, శ్రీలంక జట్ల మధ్య ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోన్న విషయం తెలిసిందే. నవంబర్ 9న హైదరాబాద్‌లోని ఉప్పల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మూడో వన్డే జరగనుంది. మూడో వన్డేకు గౌరవ అతిథిగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు హాజరుకానున్నారు.
ఆయన మ్యాచును ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. కాగా, రెండో వన్డే అహ్మదాబాద్‌లో గురువారం(నవంబర్ 6) జరగనుంది. న్యూఢిల్లీలో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా సమష్టిగా రాణించి విజయం సాధించిన విషయం తెలిసిందే.
మహారాష్ట్ర గవర్నర్‌ను సన్మానించనున్న ప్రభుత్వం

హైదరాబాద్ : మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావును రాష్ట్ర ప్రభుత్వం సన్మానించనుంది. ఈ కార్యక్రమం నవంబర్ 9న సాయంత్రం జలవిహార్‌లో జరగనుంది. కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యాసాగర్‌రావు మహారాష్ట్ర 22వ గవర్న్‌ర్‌గా 2014, ఆగస్టున బాధత్యలు స్వీకరించిన విషయం తెలిసిందే. కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ తరపున విద్యాసాగర్‌రావు రెండు సార్లు గెలుపొందారు. విద్యాసాగర్‌రావు స్వస్థలం కరీంనగర్ జిల్లా నాగారం.
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నాగిరెడ్డి
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా నాగిరెడ్డిని నియమించారు. ప్రస్తుతం ఆయన ఆర్థిక శాఖముఖ్యకార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్












Click it and Unblock the Notifications