యాదాద్రికి కేసీఆర్ శంకుస్థాపన, 'బాబు ఎప్పుడు లోపలకు వెళ్తారా అని..'

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్/నల్గొండ: రాష్ట్రం ఎదుర్కొంటున్న కొద్దిపాటి విద్యుత్ సమస్యలు త్వరలో తీరనున్నాయి. ఈ మేరకు సోమవారం నాడు నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వీర్లపాలెంలో 4వేల మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించనున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు.

తొలుత ఆయన యాదాద్రి పవర్ ప్లాంటుకు సంబంధించి నిర్మించిన పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం భూమిపూజ చేసి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిప్పులాంటి మనిషిని అని నిరూపించుకోవాలంటే తొలుత రాజీనామా చేయాలని, ఆ తర్వాత నిరూపించుకోవాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాదులో హెచ్చరించారు.

CM KCR inaugurates yadhadhri thermal power plant

ఏసీబీ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకోందన్నారు. చంద్రబాబు ఎప్పుడు లోపలకు వెళ్తారా అని ఆ రాష్ట్ర మంత్రులు ఎదురు చూస్తున్నారన్నారు.

బాబుపై కావాలనే కుట్ర

చంద్రబాబు పైన కావాలనే తెలంగాణ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మంత్రి నారాయణ మంగళగిరిలో ఆరోపించారు. ఏఅపీ అబివృద్ధిని అడ్డుకోవడానికి ఇలాంచి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్ర విభజన ఒక పద్ధతి ప్రకారం జరగలేదన్నారు.

విభజన జరిగిన నాటి నుండి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏదో ఒక విధంగా వివాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఏడాది అయినా ఇంతవరకు ఉద్యోగుల పంపకాలు జరగలేదని, ఏవీ కూడా కొలిక్కి రాలదన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
CM KCR inaugurates yadhadhri thermal power plant
Please Wait while comments are loading...