ఏపీ కాపు రాజకీయంలో కేసీఆర్ బిగ్ ట్విస్ట్, సీన్ మారుతోంది - కలిసొచ్చేదెవరికి..!!

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పవన్ వారాహి యాత్రతో మరోసారి కాపు రాజకీయం ఆసక్తి కరంగా మారింది. ఏపీలో సీఎం జగన్ లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకం అవుతున్నాయి. టీడీపీ, జనసేన పొత్తు దాదాపు ఖాయమైంది. ఏపీ ఎన్నికల్లో ఈ సారి కాపు ఓటింగ్ కీలకంగా మారుతోంది. పవన్ కాపు ఓటింగ్ ను తన వైపు తిప్పుకుంటారనే అంచనాలు ఉన్నాయి. వైసీపీ కౌంటర్ స్ట్రాటజీ అమలు చేస్తోంది. ఈ సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

కాపు ఓట్ బ్యాంక్ పై గురి:ఏపీ ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహ ప్రతివ్యూహాలతో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. 2019 ఎన్నికల్లో పక్కా సోషల్ ఇంజనీరింగ్ అమలు చేయటం ద్వారా జగన్ 151 సీట్లు సాధించారు. ఇప్పుడు జగన్ ను దెబ్బ తీయటానికి ఒక్కటైన చంద్రబాబు...

CM KCR meets Retired Kapu officials, discuss on support in next Elections as reports

పవన్ ఓట్ బ్యాంక్ కాపాడుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా వారాహి యాత్ర పవన్ కల్యాణ్ గోదావరి జిల్లాల నుంచే ప్రారంభించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు రావటానికి లేదని పిలుపునిస్తున్నారు. అక్కడ కీలకమైన కాపు ఓట్ బ్యాంక్ తమకు అనుకూలంగా మారుతుందని జనసేన ఆశలు పెట్టుకుంది. అయితే, ముద్రగడ.. వైసీపీ,జనసేన మద్దతు దారులుగా కాపు ఓటింగ్ లో చీలక కనిపిస్తోంది. ఇదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ ఏపీలో కొత్త స్కెచ్ అమలుకు సిద్దమవుతోంది.

కేసీఆర్ కీలక మంతనాలు:బీఆర్ఎస్ ను ఏపీలోనూ విస్తరించాని సీఎం కేసీఆర్ డిసైడ్ అయ్యారు. తాజాగా హైదరాబాద్‌లో కాపు వర్గానికి చెందిన కొందరు మాజీ అఖిల భారత సర్వీసు అధికారులతో సమావేశమయ్యారు. వీరిలో మాజీ ఐఏఎస్‌ అధికారి అయిన బీఆర్‌ఎస్‌ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌తో పాటు తమిళనాడు మాజీ సీఎస్‌ రామ్మోహన్‌రావు, రిటైర్డ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారులు పీవీ రావు, రంగిశెట్టి మంగబాబు, మాజీ ఐఏఎస్‌ లక్ష్మీకాంతంతో పాటు పారిశ్రామికవేత్తలు ప్రముఖులు ఉన్నారు.

ఈ సమయంలో ఏపీలోని రాజకీయాల పైన ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలో అధికారం దక్కటంలో డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్న కాపు ఓటింగ్ పైన చర్చ చేసినట్లు సమాచారం. బీఆర్ఎస్ లోకి కాపు నేతల చేరికలు..కాపు ఓటర్ల మద్దతు విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశం పైన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పవన్..చంద్రబాబు పొత్తు... వైసీపీకి కాపు ఓటింగ్ మద్దతు వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు.

CM KCR meets Retired Kapu officials, discuss on support in next Elections as reports

ఏపీలో కొత్త వ్యూహం:మేఘాలయ రిటైర్డ్‌ సీఎస్‌ కేఎం కుమార్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఓ హోటల్లో 'కాపు ఐకానిక్‌ గ్రూపు' సమావేశం జరిగింది. 4 రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో కాపు నేతలు కుటుంబాలతో తరలి వచ్చారు.

తాజాగా వారిలో ప్రముఖ నేతలు సీఎం కేసీఆర్ తో సమావేశయ్యారు. తెలంగాణలోని 25 లక్షల మంది మున్నూరు కాపు ఓటర్లు మద్దతు కూడగట్టే అంశం పైనా మంతనాలు జరిగాయని తెలుస్తోంది. జనసేనాని పవన్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగించని తోట చంద్రశేఖర్ ఇప్పుడు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నారు. కాపు ప్రముఖులతో సమావేశం తరువాత ఏపీలో కాపు నేతలతో సమావేశాలు..చేరికల పైనా ఒక కార్యాచరణ డిసైడ్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పుడు ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాల క్రమంలో బీఆర్ఎస్ సైతం కాపు వర్గం పైనే ప్రధానంగా ఫోకస్ చేస్తోంది. కాపు నేతల్లో పవన్ పైన విశ్వాసం లేదనే ప్రచారం మొదలైంది. ఈ పరిణామాలు పరోక్షంగా వైసీపీకి మేలు చేసే అవకాశం ఉందనే విశ్లేషణలు మొదలయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+