ఎపిలోనే మళ్లీ: అటవీ సదస్సులో కిరణ్ రెడ్డి సమైక్యగళం

హైదరాబాద్: రాష్ట్ర అటవీశాఖ సదస్సులో కూడా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్య నినాదం వినిపించారు. శనివారం ఉదయం రాష్ట్ర అటవీశాఖ అధికారుల సదస్సును సీఎం ప్రారంభించారు. తర్వాతి సదస్సు కూడా ఆంధ్రప్రదేశ్‌లోనే జరగాలని ఆశిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఆ రకంగా ఆయన రాష్ట్రం విడపోకూడదనే భావనను వ్యక్తం చేశారు.

అటవీశాఖలో స్మగ్లింగ్ పెద్ద సమస్య అని, దానిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. 302 లాంటి కఠిన చట్టాలను తెస్తామని సీఎం తెలిపారు. అటవీశాఖలో ఇప్పటివరకు 3801 పోస్టులను రెగ్యులరైజ్ చేశామన్నారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా అడవుల సంరక్షణకు చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు.

Kiran kumar Reddy

తుఫాను నష్టం అంచనాలపై, తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంట నష్టం అంచనాలో ఏ విధమైన పొరపాట్లు జరగకూడదని ఆయన ఆదేశించారు. ఒకటికి రెండు సార్లు పరిశీలించిన తర్వాతనే అంచనాలకు తుది రూపం ఇవ్వాలని ఆయన సూచించారు.

పంట నష్టంపై గ్రామపంచాయతీల్లో చర్చించిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకోవాలని ఆయన చెప్పారు. కౌలు రైతులపై ప్రత్యేక దృ,్టి పెట్టాలని ఆయన సూచించారు. పంట నష్టం అంచనాల్లో తప్పులు జరిగితే అధికారులదే బాధ్యత అని ఆయన అన్నారు.

కాగా, భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై ముఖ్యమంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+