పవన్ కళ్యాణ్ ట్వీట్లపై వారికి బాబు హెచ్చరిక, 'ఇదీ పవన్ అంటే, ఇక ఎక్కువగా జనంలోనే'
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ప్రతి విషయానికి స్పందించవద్దని పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు నాయుుడు అంతర్గతంగా సూచించారని తెలుస్తోంది.
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ప్రతి విషయానికి స్పందించవద్దని పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు నాయుుడు అంతర్గతంగా సూచించారని తెలుస్తోంది.
చదవండి: షాకింగ్: పవన్ కళ్యాణ్ 'డిప్యూటీ సీఎం' డిమాండ్, జగన్ ఓకే? తేల్చేసిన వైసిపి

ప్రతిదానికి స్పందించి ఇబ్బంది కలిగించొద్దు
పవన్ కళ్యాణ్ విషయంలో ప్రతి దానికి మాట్లాడి జనాల్లో జనసేననకు వ్యతిరేకంగా ఉన్నామనే అభిప్రాయం కలిగించవద్దని చంద్రబాబు నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అది మనకు ఇబ్బందిని కలిగిస్తుందని సూచించారని సమాచారం. పార్టీకి ఇబ్బందులు తీసుకు రావొద్దని చెప్పారని తెలుస్తోంది. జనసేనతో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు తెలిపారని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ పైన ఇలా
గతంలో కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు, తాజాగా మంత్రి పితాని సత్యనారాయణలు పవన్ కళ్యాణ్ పైన విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీనిపై పవన్ ఘాటుగా స్పందించారు. ఆయన ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారని సమాచారం.

అభిమానుల ఆగ్రహం
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తున్న నేపథ్యంలో ఇటీవల పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. నాయకులతో పాటు ఇతరులు కూడా ఆయనను టార్గెట్ చేసుకుంటున్నారు. ఇతరులు స్పందించడం వెనుక రాజకీయ పార్టీలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం అలాంటి సంఘన జరిగింది. పవన్ పైన ఇష్టారీతిన మాట్లాడటం దానికి అభిమానులు ఘాటుగా స్పందించడం జరిగింది.

దటీజ్ పవన్ కళ్యాణ్
ఇప్పుడు టిడిపి నేతలు విమర్శలు చేశారు. దీనిపై అభిమానులు కూడా తీవ్రంగానే స్పందించారు. అవసరం ఉన్నప్పుడు అండగా నిలిచిన వారిని మరిచారంటూ టిడిపిపై నిప్పులు చెరిగారు. ఈ నేపథ్యంలో పవన్ తన అభిమానులకు సూచనలు చేసిన విషయం తెలిసిందే. విమర్శలు హద్దు మీరితే పార్టీనే స్పందిస్తుందని, ట్విట్టర్ వేదికగా అభిమానులు స్పందించవద్దని, కువిమర్శలను పట్టించుకోవద్దని, తనపై వ్యక్తిగత విమర్శలకు మీరు స్పందించవద్దని పవన్ కళ్యాణ్ ప్రకటించి తాను అందరి నాయకులకు భిన్నం అని మరోసారి నిరూపించుకున్నారని అభిమానులు అంటున్నారు. ఇదీ పవన్ అంటే అంటున్నారు.

అప్పుడు ఏది మంచిదో అది చేశాం
జనసేన 2014 ఎన్నికల్లో కేంద్రంలో బిజెపికి, రాష్ట్రంలో టిడిపికి మద్దతు ఇచ్చిందని, అప్పటి పరిస్థితుల్లో రాష్ట్రానికి ఏది మంచిదో అదే చేసిందని ఆ పార్టీ మీడియా విభాగం అధ్యక్షులు (మీడియా హెడ్) హరిప్రసాద్ పేర్కొన్నారు.

రాబోయే ఎన్నికల్లో ఎవరితో అంటే
రాబోయే ఎన్నికల్లో ఎవరితో ఉంటామన్నది కాలమే నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. జనసేన పార్టీ తరఫున పనిచేసేందుకు వక్తలు, కంటెంట్ రైటర్లు, విశ్లేషకుల ఎంపిక కార్యక్రమం కృష్ణా జిల్లాకు సంబంధించి శనివారం విజయవాడలోని లారీ యజమానుల సంఘం సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా హరిప్రసాద్ మీడియాతో మాట్లాడారు. వక్తలు, కంటెంట్ రైటర్లు, విశ్లేషకులుగా ఎంపికైన వారందరికీ త్వరలో స్వల్పకాలిక శిక్షణ ఇస్తామన్నారు. పవన్ ఇకపై క్రియాశీలంగా వ్యవహరిస్తారని, ఎక్కువ సమయం జనంలో ఉంటారని తెలిపారు.












Click it and Unblock the Notifications