వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ వ్యూహం, బాబు కీలక భేటీ: 'బీజేపీపై కీలక నిర్ణయం, పవన్ కళ్యాణ్ అక్కర్లేదు!'

|
Google Oneindia TeluguNews

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో టీడీపీ ఎంపీలు శుక్రవారం భేటీ అయ్యారు. పలు అంశాలపై వారు చర్చించారు. విభజన హామీలు, కేంద్రం తీరు, ప్రజల్లో నెలకొన్న ఆగ్రహం తదితర అంశాలపై చర్చించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్, కేంద్రమంత్రులు, ఎంపీల రాజీనామా, అవిశ్వాసం తదితర అంశాలపై చర్చించారు.

ముఖ్యంగా వైసీపీ అవిశ్వాసం పెడతామని చెప్పిన నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై టీడీపీ చర్చించింది. జగన్ అవిశ్వాసం వ్యూహాత్మకమేనని, టీడీపీని ఇరుకున పెట్టేందుకేనని ఎంపీలు అభిప్రాయపడ్డారు. దీనిపై ఎలా ముందుకెళ్దామని చంద్రబాబు, ఎంపీలు చర్చించారు.

షా వద్దకు.. ఫలించని వెంకయ్య చొరవ: 'ఫార్ములా' చెప్పాం కానీ.. బాబుకు షాక్, జైట్లీ సంచలనంషా వద్దకు.. ఫలించని వెంకయ్య చొరవ: 'ఫార్ములా' చెప్పాం కానీ.. బాబుకు షాక్, జైట్లీ సంచలనం

కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం

కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం

చంద్రబాబుతో భేటీ నేపథ్యంలో పలువురు ఎంపీలు మీడియాతో మాట్లాడారు. కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ అన్నారు. అవిశ్వాసం, ఎంపీల రాజీనామాపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డెడ్ లైన్ ఎందుకు విధిస్తోందని ప్రశ్నించారు.

అవిశ్వాసంతో ఒరిగేదేమీ లేదు

అవిశ్వాసంతో ఒరిగేదేమీ లేదు

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడం వల్ల ఒరిగేదేమీ ఉండదని సీఎం రమేష్ తేల్చి చెప్పారు. తాము ఏపీ ప్రయోజనాల కోసం పోరాడుతామన్నారు. అవిశ్వాసం అనేది తుది అస్త్రంగా మాత్రమే ఉండాలని చెప్పారు.

రావాల్సిన వాటా వచ్చేదాకా

రావాల్సిన వాటా వచ్చేదాకా

ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. ఏపీకి రావాల్సిన వాటా వచ్చేంత వరకు తాము పోరాడుతామని చెప్పారు. మరో ఎంపీ టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు అని, ఆయనకు ఎప్పుడు ఏం చేయాలో తెలుసునని చెప్పారు.

టీడీపీతోనే సాధ్యం

టీడీపీతోనే సాధ్యం

రాష్ట్రానికి ఏం చేయాలన్నా అది తెలుగుదేశం పార్టీతో, చంద్రబాబుతోనే సాధ్యమని ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించజారు. కాంగ్రెస్, వామపక్షాలు వీధి పోరాటాలు చేస్తున్నాయని, వాటితో ఉపయోగం లేదని తేల్చి చెప్పారు. బడ్జెట్ సమావేశాల్లో నిరసనలు కొనసాగిస్తామన్నారు.

పవన్ కళ్యాణ్ జేఎఫ్‌సీపై

పవన్ కళ్యాణ్ జేఎఫ్‌సీపై

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నివేదికపై కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. పవన్ జేఎఫ్‌సీతో ఎలాంటి లాభం లేదని ఆయన వ్యాఖ్యానించారు. నిజానిజాలను ప్రజలు నిర్ధారిస్తారని, అందుకోసం ఎవరూ అక్కర్లేదని వ్యాఖ్యానించారని తెలుస్తోంది.

English summary
Ahead of second phase of the Budget Session of Parliament from March 5, Chief Minister N Chandrababu Naidu hold a crucial meeting with TDP MPs at his residence at Undavalli on Friday to chalk out a strategy to be adopted during the session.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X