భారత్ కు గుడ్ బై చెప్పిన టాప్ రియాల్టీ టెక్ కంపెనీ- లేఆఫ్స్

టెక్ సెగ్మెంట్ లో మళ్లీ లేఆఫ్స్ మొదలయ్యాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను అడాప్ట్ చేసుకుంటోన్న అనేక సంస్థ ఇప్పటికే వేలాదిమంది ఉద్యోగులను తొలగించాయి. మెటా, టీసీఎస్ మొదలుకుని అమెజాన్ వరకూ దాదాపు అన్ని ప్లాట్ ఫామ్స్ కూడా ఉద్యోగాల సంఖ్యకు కుదించుకున్నాయి. మ్యాన్ పవర్ కు బదులుగా ఏఐ టూల్స్ ను వినియోగించుకుంటోన్నాయి. కొంతకాలం పాటు సద్దుమణిగిన ఈ లేఆఫ్స్ ఉదంతం మళ్లీ తెరమీదికి వచ్చింది.

తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ టెక్నాలజీ సంస్థ ఓపెన్‌డోర్ లేఆఫ్స్ ప్రకటించింది. ప్రత్యేకించి.. భారత్ లో దీన్ని అమలు చేసింది. భారత కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల ఇక్కడ పనిచేస్తున్న దాదాపు 250 మందికి పైగా ఉద్యోగులు ప్రభావితం కానున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టూల్స్ అండ్ టీమ్ ద్వారా అమెరికా నుంచే భారత్ లో తమ కార్యకలాపాలను నిర్వహించాలని కంపెనీ నిర్ణయించుకోవడమే ఈ మార్పుకు ప్రధాన కారణం.

OpenDoor Winds Down India Operations as It Shifts Workstation to United States with AI-Native Teams

ఓపెన్‌డోర్ ఎగ్జిక్యూటివ్ కాజ్ నెజాటియన్ దీని గురించి వెల్లడించారు. భారత్ లో తమ కార్యకలాపాలను విస్తరించుకోవడంలో భాగంగా ఓపెన్‌డోర్ 2.0 కార్యాలయాలను ప్రారంభించామని, అప్పట్లో 250 మందికి ఉద్యోగులు ఉండేవారని గుర్తు చేశారు. ఇప్పుడు సంస్థ కార్యకాలాపాలన్నింటినీ కూడా అమెరికా నుంచే పర్యవేక్షించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ ఉద్యోగ బాధ్యతలను అమెరికాలోని వినియోగదారులకు మరింత చేరువ చేయాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు.

అందువల్ల భారత్‌లో కార్యకలాపాలను నిలిపివేసే ప్రక్రియను ప్రారంభించినట్లు నెజాటియన్ వెల్లడించారు. భారత్‌లోని ఉద్యోగుల పనితీరును ఆయన ప్రశంసించారు. ఈ నిర్ణయం బాధాకరమే అయినప్పటికీ.. వ్యూహాత్మక మార్పు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అడాప్ట్ నేపథ్యంలో లేఆఫ్స్ ప్రకటించక తప్పట్లేదని వ్యాఖ్యానించారు. గతంలో భారత్‌లో మాన్యువల్ వర్క్‌ఫ్లోల ద్వారా కార్యకలాపాలను పర్యవేక్షించే వాళ్లమని, ఇప్పుడు ఆ వ్యవస్థలన్నింటినీ ఏకీకృతం చేసి, AI టూల్స్‌తో అమెరికాలోనే ఏఐ-నేటివ్ టీమ్ లను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు.

తొలగింపునకు గురైన ఉద్యోగులకు బెనిఫిట్స్, అవుట్‌ప్లేస్‌మెంట్ సేవలతో కూడిన ట్రాన్సిషన్ సపోర్ట్ అందించనున్నట్లు ఓపెన్‌డోర్ హామీ ఇచ్చింది. అలాగే కీలకమైన పనిని పూర్తి చేయడానికి కొందరు ఉద్యోగులు కొంతకాలం పాటు కంపెనీతో కొనసాగుతారని తెలిపింది. ఓపెన్‌డోర్ ప్రాధాన్యతలు ఏమి మారలేదని, సంస్థ బలంగానే ఉందని నెజాటియన్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+