మా పోరాటం ఫలించింది:సీఎం రమేష్, రాజ్యసభ వాయిదా తర్వాత ఏం జరిగిందంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu
  Centre Assures Andhra Pradesh Over Special Funds

  అమరావతి: కేంద్ర బడ్జెట్‌లో ఏపీ రాష్ట్రానికి అరకొర నిధుల కేటాయింపుపై పార్లమెంట్ ఉభయ సభల్లో ఏపీకి చెందిన ఎంపీలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

  శుభవార్త: ఎంపీల నిరసనలతో దిగొచ్చిన కేంద్రం, లోటు భర్తీకి సిద్దం

  అయితే ఎంపీల నిరసనలతో కేంద్ర దిగొచ్చింది.ఏపీ రెవిన్యూ లోటును పూడుస్తామని కేంద్రం హమీ ఇచ్చిందని టిడిపి ఎంపీ సీఎం రమేష్ ప్రకటించారు.

  మొండిచేయి,ఇక తాడోపేడో: టిడిపి, జైట్లీ ప్రకటనపై బాబు అసంతృప్తి

  కేంద్ర ప్రభుత్వంపై టిడిపి ఎంపీలతో పాటు ఇతర పార్టీలకు చెందిన ఎంపీలు కూడ పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళనలు నిర్వహించారు. తమ రాష్ట్రానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి.

  మళ్ళీ నిరాశే, పాతపాటే పాడిన జైట్లీ: రూ.3973 కోట్లిచ్చాం, పోలవరానికి నిధులు

  రాజ్యసభ వాయిదా పడిన తర్వాత కేంద్ర మంత్రులతో టిడిపి ఎంపీలు చేసిన చర్చలు ఏపీకి నిధులు ఇచ్చేలా కేంద్రం నుండి సానుకూల సంకేతాలు ఇచ్చేలా చేసిందని సీఎం రమేష్ గుర్తుచేశారు.

  ఆశాజనక ఫలితాలొచ్చాయి

  ఆశాజనక ఫలితాలొచ్చాయి

  కేంద్రం నుండి ఏపీ రాష్ట్రానికి నిధులు ఇస్తామనే ఆశాజనక ఫలితాలొచ్చాయని టిడిపి ఎంపీ సీఎం రమేష్ చెప్పారు.వెన్యూ లోటును త్వరలో రిలీజ్ చేస్తామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తమతో చెప్పినట్టు రమేశ్ తెలిపారు. రాజ్యసభ ముగిసిన వెంటనే కేంద్ర మంత్రి సుజనా చౌదరితో కలిసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో చర్చించినట్టు సీఎం రమేష్ చెప్పారు.ఫైళ్లు తీసుకుని రమ్మన్నారు. వాటిని చూసిన తర్వాత రెవెన్యూలోటు, పోలవరంలపై స్పష్టత ఇచ్చారు. సాధ్యమైనంత త్వరలో నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారని సీఎం రమేష్ చెప్పారు.

  బాబు డైరెక్షన్‌లో విజయవంతమయ్యాం

  బాబు డైరెక్షన్‌లో విజయవంతమయ్యాం

  రైల్వేజోన్, దుగరాజుపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ తదితర అంశాలపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ‌తో చర్చించారు. దుగరాజుపట్నం పోర్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కోరుకొంటే అక్కడ పోర్టు ఏర్పాటు చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. పార్లమెంటులో మా ఎంపీలు చేసిన పోరాటం ఫలించింది. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆందోళనలు చేశాం. అయితే ప్రకటనలు కాదని.. వాస్తవ రూపంలోకి వస్తేనే నమ్మకం కలుగుతుందని కేంద్రానికి తెగేసి చెప్పాం.

  ఒకేసారి నిధుల విడుదలకు కేంద్రం ఒకే

  ఒకేసారి నిధుల విడుదలకు కేంద్రం ఒకే

  ప్రత్యేక హోదా వల్ల వచ్చే నిధుల కంటే ప్రత్యేక ప్యాకేజీని ఇస్తామని కేంద్రం రెండేళ్ళ క్రితం ప్రకటించింది. అయితే ప్యాకేజీకి టిడిపి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అయితే హోదా వల్లే వచ్చే నిధుల మొత్తాన్ని ఒకేసారి ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని మంత్రులు సుజనాకు వివరించారు. ఈఏపీ నిధులు కూడా సర్దుబాటు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది.

  త్వరలోనే కేంద్రం ప్రకటన

  త్వరలోనే కేంద్రం ప్రకటన

  కేంద్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించేందుకు ముందుకు వచ్చింది. విభజన చట్టంలోని అంశాలతో పాటు ఇతర హమీల విషయంలో కూడ కేంద్రం సానుకూలంగా ప్రకటనలు చేసే అవకాశం ఉందని టిడిపి ఎంపీ సీఎం రమేష్ చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Tdp mp Cm Ramesh said that union ministers Arun jaitley and piyush goel agreed to help for Ap state. Tdp mps met union ministers on Friday night at parliament.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి