ఏదో రాసుకొచ్చి చదవితే ఎలా?: సీఎం రమేశ్‌పై నిండు సభలో కురియన్

అమరావతి: ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదేనని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులపై ఆయన బుధవారం రాజ్యసభలో మాట్లాడుతూ ఉత్తరాఖండ్ మాదిరి ఏపీని కూడా కేంద్రం ఆదుకోవాలన్నారు.

భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏపీ ఒక్కటేనని వ్యాఖ్యానించారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ ఎంతగానో నష్టపోయిందన్నారు. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రం ఆదుకోకుంటే ఇంకా నష్టపోతామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ లోటుతో ఏపీ ఎన్నో కష్టాలను పడుతోందన్నారు.

ఏపీని పూర్తిస్థాయిలో ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ఏపీకి అండగా నిలిస్తామని కేంద్రం మాటఇచ్చిందని, అయినప్పటికీ... ఏపీకి మంజారు కావాల్సిన నిధులు ఇంకా మంజూరు కాలేదన్నారు. ఇలా రాజ్యసభలో ఎంపీ సీఎం రమేష్ ఏపీకి రావాల్సిన నిధుల గురించి అడిగిన సందర్భంలో డిప్యూటీ ఛైర్మన్ కురియన్ కల్పించుకుని 'రమేష్...రమేష్...రమేష్' అని పిలిచారు.

cm ramesh speech in rajya sabha over andhra pradesh special status

ప్రసంగంలో నిమగ్నపోయిన ఆయన ఆపకపోవడంతో 'రమేష్ ఒక్క మాట విను' అని అన్నారు. 'ఒక్క నిమిషం' అని ఆయన్ను అడుగుతున్నా వినిపించుకోలేదు. దీంతో 'అబ్బా! విను రమేష్' అని అన్నారు...'మీ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందా?' అని అడిగారు. 'అవును సర్' అని ఆయన సమాధానమిచ్చారు.

అయితే 'ఏ ఇబ్బందుల్లో ఉంది?' అని కురియన్ మళ్లీ ప్రశ్నించారు. దీనికి సీఎం రమేష్ చేతిలో ఉన్న పేపర్లను చదివే ప్రయత్నం చేయడంతో 'నీ రాష్ట్రంలో ఉన్న సమస్యలు నీకు తెలియక పేపర్‌పై ఉన్న సమాచారం చదువుతున్నావా?' అని కురియన్ అనడంతో సీఎం రమేష్ కొన్ని లెక్కలు చెబుతూ, రెవెన్యూలోటు పూడ్చాలని కోరారు.

దీంతో కురియన్ 'శభాష్ రమేష్ ఇదే కావాలి నీ ప్రాంతం గురించి ఏదో రాసుకొచ్చి చదవితే ఎలా?' అని అన్నారు. 'పేపర్లమీద ఆధారపడకుండా ఇలా అడిగితే సమాధానాలు వస్తాయని' కురియన్ చెప్పారు. 'ఇలా మాట్లాడాలి రమేష్' అంటూ టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ను డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ప్రోత్సహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+