ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల: సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల నియామకం అయ్యారు. ఏపీలో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ వేసిన వ్యూహాత్మక అడుగులో భాగంగా వైయస్ షర్మిలను ఏపీ పీసీసీ చీఫ్ గా నియమించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జవసత్వాలు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పునరుజ్జీవం కల్పించేందుకు వైయస్ కుటుంబానికి పట్టం కట్టిన కాంగ్రెస్ పార్టీ, అందులో భాగంగా షర్మిలకు బృహత్తరమైన బాధ్యతలను అప్పగించింది. ఒక్క ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిలను నియమించడం పట్ల పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 CM Revanth Reddy tweet over the appointment of ap congress chief ys sharmila

షర్మిలను ఏపీ అధ్యక్షురాలిగా నియమించడం పట్ల తెలంగాణ పిసిసి చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి షర్మిలను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆల్ ది వెరీ బెస్ట్ అంటూ ట్విట్టర్ వేదికగా ఆయన పేర్కొన్నారు. వైయస్సార్ తెలంగాణ పార్టీ ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి, వైయస్ షర్మిల మధ్య మాటల యుద్ధం కొనసాగింది.

ఎప్పుడైతే షర్మిల కాంగ్రెస్ పార్టీలో వైయస్సార్ తెలంగాణ పార్టీని విలీనం చేశారో ఆ తర్వాత పార్టీ లైన్ కు కట్టుబడి రేవంత్ రెడ్డి తో సఖ్యతగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఇదే క్రమంలో వైఎస్ షర్మిల తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి రేవంత్ రెడ్డి కుటుంబం రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను ఇంటికి వెళ్లి మరీ ఇచ్చి వచ్చారు.

ఆపై షర్మిలకు మద్దతుగా అవసరమైతే ఏపీ రాజకీయాలలో కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటానని చెప్పారు. ఇక తాజాగా షర్మిలకు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా అవకాశం కల్పించడంతో అంతా మంచే జరుగుతుందని శుభాకాంక్షలు తెలియజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+