అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబును 'సైడ్' చేసిన జగన్?

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైడ్ చేశారు. అధికార పార్టీపై, మంత్రులపై చంద్రబాబు విమర్శలు చేస్తున్న ప్రతిసారీ వైసీపీ నాయకులంతా స్పందించేవారు. కౌంటర్లు ఇచ్చేవారు. కొద్దిరోజులుగా గమనిస్తే ముఖ్యమంత్రి జగన్ తో సహా వైసీపీకి చెందిన మంత్రులుకానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరూ తెలుగుదేశం పార్టీ పేరుకానీ, చంద్రబాబు పేరుకానీ ఎత్తడంలేదు.

చంద్రబాబు ఎవరో తమకు తెలియదు?

చంద్రబాబు ఎవరో తమకు తెలియదు?

సూక్ష్మంగా పరిశీలిస్తే అసలు చంద్రబాబు ఎవరో? అన్నట్లుగా వైసీపీ శ్రేణులు వ్యవహరిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా టీడీపీ, వైసీపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే జనసేనాని పవన్ కల్యాణ్ వల్ల వైసీపీ తలనొప్పులను ఎదుర్కోవాల్సి వస్తోంది. యువత అంతా పవన్ వైపే ఉందనేది స్పష్టంగా అవగతమవుతోంది. రానున్న ఎన్నికల్లో వీరి ఓట్లే కీలకమవుతాయి. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన వ్యూహం మార్చింది. చంద్రబాబును సైడ్ చేసి పవన్ కల్యాణ్ పై దృష్టిసారించింది.

వ్యూహం ప్రకారం విస్మరిస్తున్నారు

వ్యూహం ప్రకారం విస్మరిస్తున్నారు


తెలుగుదేశం పార్టీ పనైపోయింది.. చంద్రబాబు పనైపోయింది.. అంటూ ప్రచారాన్ని ప్రజల్లోకి పంపిస్తున్నారు. తాము పదే పదే ఆ పార్టీని లక్ష్యంగా ఎంచుకోవడంవల్ల అనవసరంగా మైలేజ్ వస్తోందని భావిస్తున్నారు. చంద్రబాబుపై విమర్శల దాడివల్ల ప్రతిపక్షం బలంగా ఉందనే సంకేతం ప్రజల్లోకి వెళుతోందని, దీన్ని నివారించాలని ఆ పార్టీ భావిస్తోంది. దీంతో ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి నాయకుల వరకు ఎవరూ చంద్రబాబు పేరు స్మరించడంలేదు. ఉద్దేశపూర్వకంగా ఆ పేరును విస్మరిస్తున్నారు.

యువత ఓట్లు వైసీపీ వైపు మళ్లేలా..

యువత ఓట్లు వైసీపీ వైపు మళ్లేలా..


పవన్ కల్యాణ్ ను లక్ష్యంగా ఎంచుకొని పదునైన విమర్శలతో దాడిచేయడంవల్ల తమకు మేలు కలుగుతుందనేది వైసీపీ ఆలోచనగా ఉంది. పవన్ ఎక్కడ, ఏం మాట్లాడినా, చిన్న ట్వీట్ చేసినా వెంటనే వైసీపీ నుంచి స్పందన వస్తోంది. విమర్శల పర్వం ప్రారంభమవుతోంది. యువత ఓట్లు పవన్ వైపు వెళ్లకుండా ఉండాలంటే తాము జనసేనానిపై చేస్తున్న విమర్శలు పక్కా నిజమనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. దీంతో యువత ఓట్లు తమవైపు మళ్లుతాయనే యోచనలో పార్టీ ఉంది. అయితే యువత అంత తేలిగ్గా వైసీపీవైపు మళ్లుతుందా? నేతలు చేస్తున్న విమర్శలవల్ల వారిలో వైసీపీపై ద్వేషం పెరుగుతోందని, దీన్ని నివారించాలనే సూచనలు వస్తున్నాయి.

English summary
Chief Minister YS Jaganmohan Reddy sidelined Telugu Desam Party leader and leader of opposition Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X