వైఎస్ షర్మిల కుమారుడి వివాహానికి దూరంగా సీఎం వైఎస్ జగన్? ఆసక్తికర చర్చ!!
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సోదరి వైయస్ షర్మిల కుమారుడు వైయస్ రాజారెడ్డి వివాహానికి హాజరవుతారా? లేదా? అన్న చర్చ ఏపీలో జోరుగా సాగుతుంది. అయితే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైయస్ షర్మిల కుమారుడు వైయస్ రాజారెడ్డి అట్లూరి ప్రియల నిశ్చితార్థ వేడుకకు సతీమణి భారతితో కలిసి హాజరయ్యారు. కానీ ఇప్పుడు పెళ్లికి మాత్రం ఆయన హాజరు కష్టమే అన్న చర్చ జరుగుతుంది.
సీఎం జగన్ మేనల్లుడు వైయస్ రాజారెడ్డి వివాహానికి హాజరు కారు అన్నది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ఈ చర్చ వెనుక కొన్ని స్పష్టమైన కారణాలు ఉన్నాయి. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడి నిశ్చితార్థం జనవరి 17వ తేదీన హైదరాబాద్లో జరిగిన సమయంలో సీఎం జగన్ సతీ సమేతంగా హాజరయ్యారు. ఆ తర్వాత జనవరి 21వ తేదీన ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పార్టీ పగ్గాలు చేపట్టారు.

ఇక అప్పటినుంచి ఆమె సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీలో జగన్ ను గద్దె దించే వరకు పోరాటం చేస్తానంటూ శపథాలు చేస్తున్నారు. నిత్యం వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తూ, జగన్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి భారీగా డ్యామేజ్ చేస్తున్నారు.
ఇక తాజాగా ఫిబ్రవరి 17వ తేదీన షర్మిల కుమారుడి పెళ్లి జరగనుంది. ఏపీ రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైయస్ షర్మిలకు జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్న విభేదాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అన్నాచెల్లెళ్ల మధ్య వార్ పీక్స్ కు చేరుకుంటుంది. సీఎం జగన్ పైన షర్మిల, షర్మిల పైన జగన్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ పొలిటికల్ హీట్ ను పెంచుతున్నారు.
ఈ క్రమంలో షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహానికి వైయస్ జగన్ హాజరు కారు అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. ఇందుకు మరొక కారణం కూడా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో ఎన్నికల నేపథ్యంలో సిద్ధం సభలను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికి ఉత్తరాంధ్రలో భీమిలిలో మొదటి సిద్ధం సభ జరగగా, సిద్ధం సభ ఏలూరులో జరిగింది.
ఇక మూడవ సిద్ధం సభ ఇప్పటికే జరగాల్సి ఉండగా జగన్ ఢిల్లీ టూర్ నేపథ్యంలో వాయిదా పడింది. ఇక ఈ సభ తిరిగి ఈనెల 18వ తేదీన జరగనున్న క్రమంలో, సిద్ధం సభకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సిద్ధం సభకు సీఎం జగన్ హాజరుకానున్న నేపథ్యంలో షర్మిల కుమారుడి వివాహ వేడుకలకు జగన్ దూరంగా ఉండనున్నారు అన్నది ప్రస్తుతం చర్చ జరుగుతుంది.












Click it and Unblock the Notifications