ఆ పథకాల కింద నిధులను విడుదల చేసిన వైఎస్ జగన్..
YSR Kalyanamasthu and YSR Shaadi Tohfa: వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాల కింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిధులను విడుడల చేశారు. అర్హులైన లబ్దిదారుల బ్యాంకు అకౌంట్లల్లోకి 78.53 కోట్ల రూపాయల మొత్తాన్ని బటన్ నొక్కి జమ చేశారు. ఇది- అయిదో విడత నిధులు విడదల. 10,132 జంటలకు ఈ మొత్తం అందింది.
ఇప్పటి వరకు ఈ రెండు పథకాల కింద 56,194 జంటలు లబ్ది పొందాయి. వారి ఖాతాల్లోకి 427.27 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. ఈ పథకం కింద వధూవరులు లబ్ది పొందాలంటే ఖచ్చితంగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. తమ 10వ తరగతి సర్టిఫికెట్‌ను వారు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

ఈ నిబంధనను ఎందుకు పెట్టాల్సి వచ్చిందనే విషయాన్ని వైఎస్ జగన్ వివరించారు. చదువును ప్రోత్సహించడంలో భాగంగా 10 తరగతి ఉత్తీర్ణులై ఉండాలనే నిబంధనను పెట్టామని అన్నారు. వయోః పరిమితి వధువుకు 18 సంవత్సరాలు, వరుడికి 21 సంవత్సరాలు ఉండాలనే మరో నిబంధన కూడా ఉందని, బాల్య వివాహాలను నిరోధించడం, వయస్సు నిండకుండా పెళ్లి చేసుకోవడాన్ని అడ్డుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
10వ తరగతి పూర్తయిన వెంటనే ఇంటర్మీడియట్ చదువుకునేలా అమ్మఒడి పథకం కింద ప్రోత్సాహం అందిస్తున్నామని, ఇంటర్మీడియట్ పూర్తయిన తరువాత పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చే విద్యా దీవెన పథకం అమలులో ఉన్నందున డిగ్రీ వరకు చదువుకుంటారని జగన్ వివరించారు.

డిగ్రీ, ఇంజినీరింగ్ చదివే విద్యార్థులకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ కోసం వసతి దీవెన కింద ఏటా 20,000 రూపాయలను ఇస్తోన్నామని, ఫలితంగా 10వ తరగతి లోపే చదువును ఆపివేయాలనుకునే వారందరూ గ్రాడ్యుయేట్స్ అయ్యేలా అడుగులు వేయిస్తున్నామని జగన్ పేర్కొన్నారు.
తల్లిదండ్రులు విద్యాధికులై ఉంటే వారి పిల్లలు కూడా చదువుల బాట పడతారని, ఇది నవ సమాజాన్ని నిర్మిస్తుందని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో ఏదో ఇచ్చామంటే ఇచ్చామనే పరిస్థితి కాకుండా ప్రతి త్రైమాసికం పూర్తయిన వెంటనే నూతన జంటల కుటుంబానికి నగదు సాయం విడుదల చేస్తున్నామని గుర్తు చేశారు.
వైఎస్సార్ కళ్యాణమస్తు”, “వైఎస్సార్ షాదీ తోఫా" ఆర్థిక సాయాన్ని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం శ్రీ.వై.ఎస్. జగన్. #YSRKalyanaMasthu #YSRShadiThofa #CMYSJagan #AP pic.twitter.com/1XxV2Xhp8C
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) February 20, 2024
సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వరకు వెళ్లే అవకాశం లేకుండా నేరుగా గ్రామ/వార్డు సచివాలయాల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్ ఇచ్చేలా మార్పు చేశామని జగన్ అన్నారు. ఎస్సీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం 40,000 రూపాయలేనని, ఇప్పుడు తమ ప్రభుత్వం ఈ మొత్తాన్ని లక్ష రూపాయలకు పెంచిందని చెప్పారు.
గత ప్రభుత్వం 17,709 మంది జంటలకు అరకొరగా ఆర్థిక సహాయం చేసేదని, పైగా 70 కోట్ల రూపాయలను ఎగ్గొట్టిందని జగన్ చెప్పారు. తాము అర్హులైన ప్రతి జంటకూ, ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే సాయం అందిస్తున్నామని అన్నారు. ఈ పథకం వల్ల అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానంటూ నూతన వధూవరులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.












Click it and Unblock the Notifications