హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

asani: అలర్ట్‌గా ఉండాలని సీఎం జగన్ ఆదేశాలు, బాధితులకు పరిహారం ప్రకటన, అదే ఊరట

|
Google Oneindia TeluguNews

అమరావతి: తుఫాను అసని ప్రభావం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంపై తీవ్రంగా ఉంది. కోస్తాంధ్రాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు 40-50 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. సముద్రపు అలలు కూడా భారీగా ఎగిసిపడుతున్నాయి. ఇప్పటికే తీరప్రాంతాల ప్రజలు, మత్స్యకారులకు వాతావరణశాఖ, ప్రభుత్వ అధికారులు అప్రమత్తం చేశారు. ప్రభుత్వం కూడా ప్రభావిత జిల్లాల యంత్రాంగాన్ని అలర్ట్ చేసింది.

అప్రమత్తంగా ఉండాలంటూ సీఎం జగన్ ఆదేశాలు

అప్రమత్తంగా ఉండాలంటూ సీఎం జగన్ ఆదేశాలు

ఈ నేపథ్యంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తుపాను దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై ఆయన ఆదేశాలు జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటికే నిధులిచ్చామని తెలిపారు. ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఉండకూడదన్నారు.

అసని బాధితులకు సీఎం పరిహారం ప్రకటన: అదే ఊరటన్న జగన్

అసని బాధితులకు సీఎం పరిహారం ప్రకటన: అదే ఊరటన్న జగన్

ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం జగన్ ఆదేశించారు.
అవసరమైన చోట సహాయం, పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. సహాయ శిబిరాలకు తరలించి వ్యక్తికి రూ. 1000, కుటుంబానికి రూ. 2వేలు చొప్పున ఇవ్వాలని సీఎం జగన్ అధికారులకు చెప్పారు. సహాయక శిబిరాల్లో మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. జనరేటర్లు, జేసీబీలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అసని తుపాను బలహీనపడటం ఊరటనిచ్చే అంశమని సీఎం జగన్ అన్నారు.

ఆయా జిల్లాల్లో తుఫాను ప్రభావం.. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం

ఆయా జిల్లాల్లో తుఫాను ప్రభావం.. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం


విశాఖపట్నం, తుర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తుఫాను ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపై అసని తుపాన్‌ ప్రభావం ఎక్కువగా ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఏపీ తీర ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను మొహరించారు. తీర ప్రాంత మండలాల్లో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. మరోవైపు పలువురు మంత్రులు అసని తుపాను ప్రభారంపై ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉండాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

తుఫాను బాధితుల కోసం కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు:

తుఫాను బాధితుల కోసం కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు:


విశాఖపట్నం: 0891-2590100,102
అనకాపల్లి: 7730939383
కాకినాడ కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 18004253077
కాకినాడ ఆర్డీవో ఆఫీస్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 0884-2368100
శ్రీకాకుళం: 08942-240557
తూర్పు గోదావరి: 8885425365
ఏలూరు కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 18002331077
విజయనగరం: 08922-236947
పార్వతీపురం మన్యం: 7286881293
మచిలీపట్నం కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 08672 252572
మచిలీపట్నంం ఆర్డీవో ఆఫీస్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 08672 252486
బాపట్ల కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 8712655878, 8712655881
ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 90103 13920.

English summary
cm ys jagan review meeting over asani cyclone: key orders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X