CM Jagan-Bharathi Wedding Anniversary : సిమ్లాలో వేడుక జరుపుకోనున్న సీఎం దంపతులు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు నేడు 25వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇందుకోసం రెండు రోజుల క్రితమే హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాకు కుటుంబ సమేతంగా వెళ్లారు. ఐదు రోజుల పాటు అక్కడే గడపనున్నారు. పాలనా వ్యవహారాలతో నిత్యం బిజీ బిజీగా గడిపే సీఎం జగన్... ఈ 5 రోజులు సిమ్లాలో కుటుంబంతో సేద తీరనున్నారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,భారతిలకు 1996,ఆగస్టు 28న వివాహం జరిగింది. వివాహ సమయంలో జగన్ వయసు 24 సంవత్సరాలు.కడప జిల్లాలోని పులివెందుల పట్టణంలో ఉన్న లయోలా కాలేజీ మైదానంలో వివాహ వేడుక జరిపించారు. జగన్ తండ్రి,దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కడప ఎంపీగా ఉన్న సమయంలో ఈ వివాహం జరిగింది. భారతి పులివెందుల పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు గంగిరెడ్డి కుమార్తె. ప్రస్తుతం ఆమె భారతి సిమెంట్స్,సాక్షి మీడియా గ్రూప్‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న తెలిసిందే.

జగన్-భారతి దంపతులకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె హర్షారెడ్డి,చిన్న కుమార్తె వర్షా రెడ్డి. హర్షారెడ్డి ప్రస్తుతం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో చదవుతున్నారు. చిన్న కుమార్తె వర్షా రెడ్డి ప్యారిస్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు,దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి తనయ సునీతా రెడ్డి వివాహం కూడా అదే రోజు,అదే లయోలా కాలేజీ మైదానం వేదికగా జరిగింది. ఇద్దరి వివాహాలకు సంబంధించి ఒకే పత్రికను అచ్చు వేయించారు. సునీతా రెడ్డి ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు.

Recommended Video
ఇదిలా ఉంటే,వైఎస్ జగన్ సిమ్లా టూర్‌పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కుటుంబంతో రిలాక్స్ అయ్యేందుకు జగన్ సిమ్లా వెళ్లారని తెలుస్తుండగా... ఆయన ప్రత్యర్థులు మాత్రం మరో వాదన వినిపిస్తున్నారు. బెయిల్ రద్దు అంశంపై సీబీఐ కోర్టులో తీర్పు రిజర్వ్‌లో ఉండటం... ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జగన్‌తో భేటీ అవడం... ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే అసలు కథ వేరే ఉండొచ్చునని వారు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదే టూర్‌లో మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన లిస్టును కూడా సీఎం ఖరారు చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పేరుకు ఫ్యామిలీ టూర్ అని చెబుతున్నప్పటికీ... ఇది పక్కా పొలిటికల్ టూర్ అనే ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications