టీం ఇండియా క్రికెటర్‌తో "కోర్టు బ్యూటీ "ప్రేమాయణం !!!
తెలుగు సినీ పరిశ్రమలో ఒక్క సినిమాతోనే ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది యువ నటి శ్రీదేవి. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది ఈ ముద్దుగుమ్మ. 'కోర్ట్' సినిమాలో జాబిలి పాత్రలో అద్భుతమైన నటన కనబరిచి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ భామ.. ఇప్పుడు వరుస సినిమాలతో కెరీర్‌ను దూసుకెళ్తోంది. నటనలో సహజత్వం, స్క్రీన్ ప్రెజెన్స్, ఎమోషనల్ సీన్స్‌లో చూపిన ప్రభావంతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.
'కోర్ట్' మూవీతో వచ్చిన క్రేజ్..
'కోర్ట్' సినిమాలో శ్రీదేవి అపల్ల పోషించిన జాబిలి పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె నటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ఒక కొత్త హీరోయిన్‌గా కాకుండా, ఇప్పటికే అనుభవం ఉన్న నటిలా మెచ్యూర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం విశేషం. అదే సమయంలో హీరో హర్ష్ రోషన్ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తూ మంచి స్క్రీన్ ప్రెజెన్స్ చూపించాడు. వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ జంటకు మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది.

'బ్యాండ్ మేళం'తో మరోసారి..
'కోర్ట్' తర్వాత హర్ష్ రోషన్, శ్రీదేవి అపల్ల జంటగా నటించిన చిత్రం 'బ్యాండ్ మేళం'. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రీసెంట్ గానే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ దక్కించుకుంది. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య నిర్మించారు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సాయికుమార్ కీలక పాత్రతో మెప్పించారు.
తమిళ, మలయాళ ఇండస్ట్రీల్లోకి శ్రీదేవి..
టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి.. ఇప్పుడు తమిళ, మలయాళ సినీ పరిశ్రమల్లోకి కూడా అడుగుపెడుతోంది. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై రూపొందుతున్న 'హైకు' చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తోంది. డాక్టర్ అరుళనందు, మాథ్యో అరుళనందు నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోంది. నిర్మాత డాక్టర్ అరుళనందు పుట్టినరోజు సందర్భంగా విడుదలైన 'హైకు' ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో మంచి స్పందన తెచ్చుకుంది. ఈ సినిమాలో హీరోగా ఏగన్ నటిస్తుండగా, 'మిన్నల్ మురళి' ఫేమ్ ఫెమినా జార్జ్ మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఇది ఆమె తొలి తమిళ, మలయాళ ప్రాజెక్ట్ కావడంతో దక్షిణాది మొత్తం ప్రేక్షకుల దృష్టి ఇప్పుడు ఆమెపై పడింది.

సోషల్ మీడియాలో వైరల్..
ఇక సినిమాలతో పాటు శ్రీదేవి వ్యక్తిగత జీవితం కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. గత కొన్ని రోజులుగా ఓ యువ భారత క్రికెటర్‌తో ఆమె ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంపై శ్రీదేవి కానీ, ఆ క్రికెటర్ కానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం వీరిద్దరి మధ్య ఏదో స్పెషల్ బాండింగ్ ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కొందరు అయితే "టాలీవుడ్‌కు మరో స్టార్ కపుల్ రాబోతుందా?" అంటూ కామెంట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications