పవన్ పై సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు, ఓట్లు అమ్ముకొనే వ్యాపారి..!!
ముఖ్యమంత్రి జగన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డారు. యూజ్ అండ్ త్రో పవన్ సిద్దాంతంగా వ్యాఖ్యానించారు. అభిమానులు ఓట్లు హోల్ సేల్ గా అమ్ముకోవడానికి దత్త పుత్రుడు అప్పుడప్పుడు వస్తారని ఎద్దేవా చేసారు. దత్తపుత్రుడు ఇంట్లో ఇల్లాలు మూడు నాలుగు ఏళ్ల కి మారిపోతుందని పేర్కొన్నారు. సొంత వర్గాన్ని,పార్టీ ను అమ్ముకుంటున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేసారు.మన కాపులు, ప్రజలు కి దత్త పుత్రుడు వంటి వ్యక్తి మీద ఎలా ప్రేమ ఉంటుందని సీఎం జగన్ ప్రశ్నించారు.
సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు : ముఖ్యమంత్రి జగన్ దత్తపుత్రుడు అంటూ పవన్ పైన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. దత్తపుత్రుడు ఇల్లు హైదరాబాద్ లోనే ఉంటుందని..కానీ, ఇల్లాలు మాత్రం ప్రతీ మూడేళ్లకు ఒకసారి మారిపోతారని చెప్పుకొచ్చారు. ఒక సారి లోకల్..ఒకసారి నేషనల్..మరోసారి ఇంటర్నేషనల్ అంటూ ఎద్దేవా చేసారు. ఏపీలో దోచుకోవటం..హైదరాబాద్ లో పంచుకోవటం అలవాటు అయిందన్నారు.

చంద్రబాబు..దత్త పుత్రుడు ఏపీలో ఉండరని..ఆయన కుమారుడు..ఆయన బామ్మర్ది ఉండంటూ లోకేశ్..బాలయ్య గురించి చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఎప్పుడైనా నెల రోజులైనా ఏపీలో కనిపించారా అని ప్రశ్నించారు. ఇప్పుడు రాజమండ్రిలో కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలో కూడా చంద్రబాబు పేదలకు మేలు చేయలేదని మండిపడ్డారు.
ఓట్లు అమ్ముకొనే వ్యాపారి : దత్తపుత్రుడు షూటింగ్ గ్యాప్ లో వ్యాపారానికి వస్తాడని ముఖ్యమంత్రి ఫైర్ అయ్యారు. ప్యాకేజీ స్టార్ కి పోటీ చేసి ఓడిపోయిన భీమవరం తో సంబంధము లేదు.. గాజువాక తో అనుబంధం లేదని వ్యాఖ్యానించారు.సరుకులు..సరంజామా అమ్ముకొనే వాళ్లను చూసాము..కానీ, సొంత పార్టీని..వర్గాన్ని అమ్ముకొనే వ్యాపారిని మాత్రం ఇక్కడే చూస్తున్నామంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు.
వివాహ వ్యవస్థపై దత్తపుత్రుడికి గౌరవం లేదని వ్యాఖ్యానించారు. వాడుకోవడం, వదిలేయడంగానే నియోజకవర్గాలనూ ఆయన భావిస్తాడు అని జగన్ మండిపడ్డారు. మన మట్టి, మన మనుషులతో అనుబంధం లేని వ్యక్తులు వీరని మండిపడ్డారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు కూడా అనలేరని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఏరోజు పేదల కోసం ఆలోచన చేయలేదన్నారు.

సొంతింటి కల నేరవేర్చాం : సామర్లకోటలలో ఇళ్లు ప్రారంభించిన సీఎం జగన్ 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించామని చెప్పారు. డేళ్లలోనే పేదల సొంతింటి కలను నెరవేర్చామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17వేల జగనన్న కాలనీలు ఏర్పాటు అవుతున్నాయని వివరించారు. కడుతున్నవి ఇళ్లు కాదు.. ఊళ్లని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 7.43 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా మరో 14.33లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని చెప్పారు. ప్రతీ పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తోందన్నారు. లక్షల విలువైన ఆస్తిని అక్కచెల్లెమ్మల చేతిలో పెడుతున్నామని పేర్కొన్నారు. ప్రతీ ఇంటికి మంచి జరిగిందని నమ్మితేనే తనకు తోడుగా ఉండాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications