కొడాలి నాని, పేర్ని నానిల నియోజకవర్గాల్లో జగన్..!!
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి జిల్లాల పర్యటనలను మరింత ముమ్మరం చేస్తోన్నారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న నేపథ్యంలో జనం మధ్యే గడపడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుంటోన్నారు. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి ప్రాజెక్టులపై దృష్టి సారించారు.
ఇటీవలే విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించారు. భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం, తారకరామతీర్ధ సాగర్ ప్రాజెక్ట్ మిగులు పనులకు సంబంధించి ఏర్పాటు చేసిన శిలా ఫలకాలను ఆవిష్కరించారు. విశాఖపట్నంలో అదాని డేటా సెంటర్, వైజాగ్ ఐటీ టెక్ పార్క్ నిర్మాణానికి శంకుస్ధాపన చేశారు.

ఈ నెల 12వ తేదీన వైఎస్ జగన్ నెల్లూరు జిల్లా కావలిలో పర్యటించనున్నారు. చుక్కల భూముల పట్టాలను రైతులకు పంపిణీ చేయనున్నారు. గతంలో చుక్కల భూముల సమస్యలను ప్రభుత్వ పరిష్కరించిన విషయం తెలిసిందే. దీనికోసం ప్రత్యేకంగా జీఓ తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇప్పుడు ఆ చుక్కల భూముల పట్టాలను రైతులకు పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
కావలి పర్యటన అనంతరం వైఎస్ జగన్ కృష్ణా జిల్లాలో పర్యటించడానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 19వ తేదీన గుడివాడ, 22వ తేదీన మచిలీపట్నం వెళ్లనున్నారు. ఈ రెండు చోట్ల కూడా టిడ్కో ఇళ్ల కాలనీలను ప్రారంభిస్తారు. మొత్తం 300 ఎకరాల్లో అభివృద్ధి చేసిన టిడ్కో లే అవుట్ ఇది. ఇందులో 8,912 ఇళ్లను ప్రభుత్వం నిర్మించింది. 900 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలను కల్పించింది.
నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో- వాటిని లబ్దిదారులకు అందజేయనున్నారు జగన్. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మాజీ మంత్రి, గుడివాడ శాసన సభ్యుడు కొడాలి నాని పరిశీలించారు. తన సొంత నియోజకవర్గానికి జగన్ రానున్నందున దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారాయన. జిల్లా గృహనిర్మాణ శాఖ, ఆర్ అండ్ బీ, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం తన హయంలో 1,200 ప్లాట్లను మాత్రమే నిర్మించిందని, తమ ప్రభుత్వం ఈ నాలుగేళ్ల కాలంలోనే ఈ సంఖ్యను 9,000లకు తీసుకెళ్లిందని చెప్పారు. దీనికి అదనంగా నవరత్నాల్లో ప్రతిపాదించిన పేదలందరికీ ఇల్లు పథకం కింద టిడ్కో లేఅవుట్ సమీపంలో 6,700 ఇళ్లను ప్రభుత్వం నిర్మిస్తోందని వివరించారు. ఒక్క కృష్ణా జిల్లాలో 27,872 ఇళ్లను తమ ప్రభుత్వం నిర్మిస్తోందని చెప్పారు.
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications