మంగళగిరిలో సీన్ రివర్స్ - ఆ పార్టీకి డేంజర్ బెల్స్...!!

ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఈ సారి ఆ రెండు నియోజకవర్గాల పై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం...లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి లో గెలుపు పైన టార్గెట్ ఫిక్స్ చేసింది. లోకేష్ ను చంద్రబాబు కేవలం మంగళగిరికే పరిమితం చేసారు. మంగళగిరిలోనే ప్రచారం చేస్తున్నారు. 2019లో గెలిచిన చోట ఈ సారి గెలవాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు జగన్ మంగళగిరిలో ఆపరేషన్ ప్రారంభించారు. లోకేష్ మూలాలను టార్గెట్ చేసారు.

జగన్ ఆపరేషన్
2019 ఎన్నికల్లో నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి అదే నియోజకవర్గం నుంచి గెలుపొందేందుకు చాలా రోజులుగా మంగళగిరిలో ప్రచారం చేస్తున్నారు. అక్కడ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేసారు. ఈ సారి మంగళగిరిలో గెలవటం లోకేష్ కు రాజకీయ భవిష్యత్ కు కీలకంగా మారుతోంది. దీంతో..గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇదే సమయంలో మంగళగిరిలో వైసీపీ నుంచి బీసీ వర్గానికి చెందిన లావణ్యను బరిలోకి దిగారు. లావణ్యకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే ఆర్కే, మురుగుడు కుటుంబం ప్రచారం చేస్తోంది. తాజాగా బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ మంగళగిరిలో పర్యటించారు.

CM YS Jagan Special Focus on Mangalagiri to target Nara Lokesh fixed action paln

90 శాతం కుటుంబాలపై గురి
ముఖ్యమంత్రి జగన్ మంగళగిరిలో పరిస్థితుల పైన ఆరా తీసారు. సర్వే నివేదికల గురించి చర్చించారు. స్థానికంగా ఎక్కువ సంఖ్యలో ఉన్న చేనేత వర్గానికి చెందిన వారితో సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో జగన్..బీసీలు ఎక్కువగా ఉన్నా.. చంద్రబాబు బీసీలకు సీటు ఇవ్వలేదన్నారు. కుప్పంలో కూడా బీసీలే ఎక్కువ.. అక్కడా బీసీలకు టికెట్‌ ఇవ్వరని.. రెండు నియోజకవర్గాల్లోనూ తాము బీసీలకు సీటు ఇచ్చామని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఆసక్తి కర లెక్కలను వెల్లడించారు. మంగళగిరిలో లక్షా 20 వేల కుటుంబాలు ఉన్నాయన్నారు. లక్షా 8 వేల కుటుంబాలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించామని చెప్పారు. పార్టీ నుంచి చేనేత వర్గానికి ఇచ్చిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, పదవుల గురించి వివరించారు.

CM YS Jagan Special Focus on Mangalagiri to target Nara Lokesh fixed action paln

జగన్ దిశా నిర్దేశం
నేతన్నల కోసం అందించిన సాయం గురించి చెప్పుకొచ్చారు. నేతన్నల కోసం రూ 3 వేల కోట్ల కోసం ఖర్చు చేసామని చెప్పారు. చంద్రబాబు తన కుమారుడిని డబ్బుతో గెలిపించాలని చూస్తున్నారని ఎద్దేవా చేసారు. కానీ, ఓటు వేసే సమయంలో పథకాలు ఎవరు ఇస్తారనేది గుర్తు చేసుకోవాలని సూచించారు. అమరావతిలో ఇంటి స్థలాలు ఇస్తుంటే చంద్రబాబు అడ్డుకున్నారన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తరువాత అక్కడే ఇస్తామని..సాధ్యం కాకుంటే ఆరు నెలల సమయంలో మరో చోట స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ లెక్కల ద్వారా ప్రతీ ఇంటికి వెళ్లి ప్రచారం చేయాలని జగన్ సూచించారు. సర్వేల్లోనూ సామాజిక సమీకరణాలు కలిసి వస్తాయని తేలందని పార్టీ నేతలకు చెప్పారు. దీని ద్వారా..కలిసి కట్టుగా పార్టీ నేతలు ప్రచారం చేసి..సీటు గెలవాలని జగన్ నిర్దేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+