సీఎం జగన్ సర్‌ఫ్రైజ్ చేశారు: రజనీ, ఆమెకు పరిశ్రమల శాఖ..? రోజాకు హోం..?

కొత్తగా మంత్రి పదవీ వరించిన వారి ఆనందానికి అడ్డూ లేకుండా పోయింది. అవును సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. ఆ కోవలో గుంటూరు జిల్లా చిలుకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ చేరారు. తనకు మంత్రి పదవీ వస్తుందని అనుకోలేదని ఆమె చెబుతున్నారు. మంత్రి పదవి దక్కుతుందని కలలో కూడా ఊహించలేదని అన్నారు. సీఎం జగన్ తనను సర్ ప్రైజ్ చేశారని తెలిపారు.

సాధారణ బీసీ మహిళకు

సాధారణ బీసీ మహిళకు

ఓ సాధారణ బీసీ మహిళ తనకు ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం కల్పించారని తెలిపారు. ఇప్పుడు ఏకంగా మంత్రిగా అవకాశం ఇచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. తొలిసారి ఎమ్మెల్యేనైనా తనకు మంత్రి బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు. తనపై సీఎం జగన్ ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్ వెంటే నడుస్తానని రజని ప్రతీన బూనారు. ప్రతి అంశంలో తనను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో పోస్టులు

సోషల్ మీడియాలో పోస్టులు

వాస్తవానికి రజనీ పేరు ఊహాగానాల లిస్టులో లేదు. సామాజిక సమీకరణాలు, మహిళలు.. పాతవారు.. కొత్తవారు అనే లెక్కల్లో ఆమెను తీసుకున్నారు. రోజాకు కూడా అవకాశం కల్పించారు. తానేటి వనిత కూడా వీరితో ఉన్నారు. రజనీ నియోజకవర్గ ప్రజలతో ఎప్పుడూ టచ్‌లో ఉంటారు. సమస్యలపై వేగంగా స్పందిస్తారు. దానికి సంబంధించిన వీడియోలు ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసేవారు. ఇప్పుడు ఆమెకు మంత్రి పదవీ వరించి.. బాధ్యతను మరింత పెంచింది.

రోజాకు హోం..? రజనీకి పరిశ్రమలు..?

రోజాకు హోం..? రజనీకి పరిశ్రమలు..?

మంత్రివర్గంలో చివరి క్షణంలో రోజాకు బెర్త్ కన్ఫామ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆమెకు హోం మంత్రి పదవీ వరించనుందని తెలుస్తోంది. మేకతోటి సుచరిత స్థానంలో ఆమె పదవీ బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఉంది. రజనీకి పరిశ్రమల శాఖ ఇచ్చే ఆస్కారం ఉంది. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చనిపోయిన తర్వాత ప్రచారం జరిగింది. అదీ ఇప్పుడు నిజం అయ్యే అవకాశం ఉంది. కానీ శాఖలపై రేపు, లేదంటే ఎల్లుండి స్పష్టత వచ్చ అవకాశం ఉంది.

ఇదీ జగన్ లెక్క

ఇదీ జగన్ లెక్క

శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు.. విజయనగరం నుంచి బొత్స సత్యనారాయణ, రాజన్నదొరకు చోటు లభించింది. విశాఖపట్టణం నుంచి గుడివాడ అమర్నాథ్‌, ముత్యాలనాయుడు, తూర్పు గోదావరి నుంచి దాడిశెట్టిరాజా, విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పశ్చిమ గోదావరి నుంచి తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణకు అవకాశం లభించింది.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామికేబినెట్‌లో తిరిగి చోటు లభించింది. ఆర్కే రోజా, జోగి రమేష్‌, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున కేబినెట్‌లో అవకాశం కలిగింది. విడదల రజనీ, కాకాని గోవర్ధన్‌రెడ్డి, అంజాద్ బాషా.. బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం, ఉషా శ్రీచరణ్‌, తిప్పేస్వామి మంత్రులుగా రేపు ఉదయం ప్రమాణ స్వీకారం చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+