వైఎస్ జగన్ తిరుపతి టూర్.. వాయిదా

తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు తిరుపతి జిల్లా పర్యటనకు రావాల్సి ఉంది. జిల్లాలోని సూళ్లూరు పేట నియోజకవర్గంలోని మాంబట్టు వద్ద స్పెషల్ ఎకనమిక్ జోన్‌ వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాల్సి ఉంది. ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట సమీపంలో మాంబట్టు స్పెషల్ ఎకనమిక్ వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాల్సింది ఉంది. అక్కడే బహిరంగ సభను ఉద్దేశించి ఆయన ప్రసగించాల్సి ఉంది.

CM YS Jagans visit to Tirupati district, has been postponed

వాకాడు మండలం రాయదరువు సమీపంలో ఫిష్ ట్రాన్‌పోర్టింగ్ అండ్ ల్యాండింగ్ సెంటర్‌, పులికాట్ సరస్సు ఆధునికీకరణ పనులకు జగన్ శంకుస్థాపన చేయాల్సి ఉంది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్‌కెు చెందిన పైప్ లైన్ పనుల వల్ల జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాల సంక్షేమం కోసం బటన్ నొక్కి నిధులను విడుదల చేయాల్సి ఉంది.

దీనికి సంబంధించిన అన్ని ఏర్పాటు ఇదివరకే పూర్తయ్యాయి కూడా. అనూహ్యంగా భారీ వర్షాలు పడటం వల్ల జగన్ పర్యటన వాయిదా పడింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు రీ షెడ్యూల్ చేయనున్నారు. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనేది ఇంకా వెల్లడించలేదు.

పరిస్థితులు అనుకూలించకపోతే- తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచే వీడియో కాన్ఫరెన్స్, వర్చువల్ విధానంలో ఆయా పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, నిధుల విడుదల కార్యక్రమాలను నిర్వహించే అవకాశాలు లేకపోలేదని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+