నో కాంప్రమైజ్ - వీడని పంతం, మళ్లీ మొదలు..!!
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కీలక వ్యాఖ్యలు చేసారు. పంద్రాగస్టు వేడుకల్లో మరోసారి ఇరు రాష్ట్రాలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న బనకచర్ల పైన ప్రస్తావించారు. తమ వాదనకే కట్టుబడి ఉన్నారు. బనకచర్లతో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఇదే సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ స్పందించారు. నీటివాటా హక్కుపై రాజీలేదని తేల్చి చెప్పారు. అటు కేంద్రం ఈ వ్యవహారంలో ఆచి తూచి వ్యవహరిస్తోంది.
బనకచర్ల ప్రాజెక్టు పైన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరో సారి తమ వాదన వినిపించారు. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించిన ఇద్దరు ముఖ్యమంత్రులూ ఇప్పటి వరకు తాము వినిపిస్తున్న వాదనే కొనసాగించారు. బనకచర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్లతో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని స్పష్టం చేశారు. బనకచర్లపై ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని.. సముద్రంలోకి వృథాగా పోయే నీటినే వాడుకుంటాం అని అన్నారు. ఎగువ రాష్ట్రాల వరద నీటితో నష్టాలనూ భరిస్తున్నామని.. అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరమేంటని చంద్రబాబు ప్రశ్నించారు. వరదను భరించాలి కానీ ఆ నీటిని వాడుకోవద్దా అంటూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.













Click it and Unblock the Notifications