సహకార బ్యాంక్ అధ్యక్షుడు, వైసీపీ నేత దారుణ హత్య
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాజధాని అనంతపురం జిల్లాలో ఘోరం జరిగింది. జిల్లాలోని పెద్దవడుగూరు మండలం కిష్టిపాడులో సహకార బ్యాంక్ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డిని కొందరు గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. బ్యాంక్ సొసైటీ కార్యాలయంలోనే ఆయనను హత్య చేశారు. మృతుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ
ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం నాగిరెడ్డిపల్లిలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పదిమంది గాయపడ్డారు. గాయపడిని వారిని కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఈ కేసుపై దర్యాప్తు సాగిస్తున్నారు.

బావిలో దూకి దంపతుల ఆత్మహత్య
విజయనగరం జిల్లాలోని దమరసింగిలో బావిలో దూకి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. దంపతులు ఆత్మహత్య చేసుకోవటానికి కారణాలు తెలియరాలేదు. మృతదేహాలను బాలిలో నుంచి వెలికితీసి పోస్టుమార్టం కోసం పంపించారు.
భర్త ఆత్మహత్య
తనను భార్య వదిలి వెళ్లిందని మనస్థాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుంటూరు జిల్లా సతైనపల్లిలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications