పిఠాపురం బరిలో ఊహించని వ్యక్తి

ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. నామినేషన్ల ఘట్టం ముగియడంతో నేతలందరూ కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. మే 13 పోలింగ్, జూన్ 4న ఫలితాలు రానున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారంలోకి రావాలని వైసీపీ భావిస్తుంది. అదే సమయంలో ఎలాగైనా జగన్ విజయాన్ని అడ్డుకోవాలని ప్రతిపక్ష కూటమి భావిస్తోంది. అయితే రాజకీయ పార్టీలన్నీ కూడా రెబల్స్ బెడదను ఎదుర్కొంటున్నాయి.

ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రెబల్స్ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటుంది. దాదాపు 15 నియోజకవర్గాల్లో టీడీపీ రెబల్స్ అభ్యర్థులు నామినేషన్ వేసినట్టుగా తెలుస్తోంది. టీడీపీ అధిష్టానం రెబల్స్‌ను బుజ్జగించే పనిలో పడింది. కూటమి అధికారంలోకి రాగానే నామినేటెడ్ పదవులు ఇస్తామని స్వతంత్ర అభ్యర్థులకు టీడీపీ అధిష్టానం ఆఫర్ చేస్తోంది.

cobbler contests elections in pithapuram constituency

ఇదిలా ఉంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేయబోయే పిఠాపురం నియోజకవర్గంలో సైతం స్వతంత్ర అభ్యర్థులు అధికంగానే నామినేషన్లు దాఖలు చేశారు. ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్ దాఖలు చేయగా, అధికార వైసీపీ నుంచి వంగా గీత నామినేషన్ దాఖలు చేశారు.పిఠాపురంలో స్వతంత్ర అభ్యర్థులు రంగంలోకి దిగారు. వీరిలో చెప్పుల కుట్టే వ్యక్తిగా కూడా ఉండటం ఇప్పుడు సంచలనంగా మారింది. కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చెప్పులు కుట్టే వ్యక్తి ఏడిద భాస్కరావు ఎన్నికల బరిలో నిలిచారు.

గురువారం స్వతంత్ర అభ్యర్థిగా భాస్కరావు నామినేషన్ దాఖలు చేశారు. ఇంటర్ వరకు చదువుకున్న భాస్కర్ ప్రభుత్వ కాలేజీ ముందు చెప్పులు కుడుతు జీవనం సాగిస్తున్నాడు. ఇలా చెప్పులు కుట్టడం ద్వారా వచ్చిన సంపాదనతో కుటుంబాన్ని పోషిస్తున్నారు భాస్కర్ రావు. అఫిడవిట్‌లో తన దగ్గర రూ.20 వేల నగదు మాత్రమే ఉందని చూపించాడు. నువ్వే నేనా అన్నట్టుగా సాగుతున్న పిఠాపురం రాజకీయంలో స్వతంత్ర అభ్యర్థిగా భాస్కరరావు పోటీ చేయడం ఆసక్తికరంగా మారింది.స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న భాస్కర్ రావు‌కు ఎంతమంది అండగా నిలుస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+