వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ‌రిలోకి రాజ‌కీయ‌ పుంజులు, ప‌ందేల వెల రూ. 2 వేల కోట్లు: భారీ కాన్వాయ్ తో త‌ల‌సాని...

|
Google Oneindia TeluguNews

ఎన్నిక‌ల ఏడాది రాజ‌కీయ పుంజులు బ‌రిలోకి దిగుతున్నాయి. ప్ర‌తీ ఏటా సంక్రాంతి పండుగకు నిబంధ‌న‌ల‌ను బేఖాత ర్ చేస్తూ భారీగా కోడి పందేలు నిర్వ‌హించ‌టం ఏపిలో స‌ర్వ సాధార‌ణం. ఈ ఏడాది ప్ర‌త్యేకంగా రాజ‌కీయ నేత‌లే సొంత ఖ‌ర్చులు భ‌రించి మ‌రీ పందేలు నిర్వ‌హిస్తున్నారు. ఇక‌, తెలంగాణ ప్రాంతం నుండి ఓ మంత్రి స్వ‌యంగా ఈ పందేలు చూడ‌టానికి వ‌స్తున్నారు. ఇర‌, ఈ సారి పందేల వెల దాదాపు రెండు వేల కోట్ల వ‌ర‌కు ఉంటుద‌ని అంచనా.

రంజు మీద ఉన్నాయి..ఖ‌ర్చు నో ప్రాబ్లం..

రంజు మీద ఉన్నాయి..ఖ‌ర్చు నో ప్రాబ్లం..

ఏప లోని ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ప్ర‌తీ సంక్రాంతికి కోడి పందేలు సాధార‌ణ‌మైన విష‌యం. ఈ సారి గోదావ‌రి జిల్లాల తో పాటుగా కృష్ణా జిల్లా అంపాపురంలో వినూత్నంగా కోడిపందేలు నిర్వహిస్తున్నారు. మొత్తం ఐదు పందేల్లో వరుసగా మూడు పందేలు గెలిచిన వారికి బుల్లెట్‌లను బహుమతిగా ప్రకటించారు. కోడి పందేల‌ను సంకాంత్రి మూడు రోజులూ వీటిని భారీగా నిర్వహించడానికి రాష్ట్రంలో పలుచోట్ల బరులు సిద్ధం చేశారు. సోమవారం నుంచే కోడి పందేల జాతరకు తెరలేవనుంది. ఉభయగోదావరితోపాటు కృష్ణా జిల్లాలోనూ ఈ సందడి తారస్థాయికి చేరింది. అయితే పశ్చిమగోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో కోడిపందేల కోసం చేస్తున్న ఏర్పాట్లను పోలీసులు అడ్డుకున్నారు. చదును చేసిన నేలను ట్రా క్టర్లతో దున్నేయించారు. అయితే ఎన్నికల ఏడాది కావడంతో చాలాచోట్ల పందేల నిర్వహణను నాయకులు ప్ర తిష్ఠగా తీసుకుంటున్నారు. కృష్ణాజిల్లాలో ముడుపులను ముందుగానే ముట్టజెప్పి మూడురోజుల సందడికి లైన్‌క్లియర్‌ చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

బ‌రిలో తెలంగాణ పుంజులు..కోట్ల‌లో పందేలు

బ‌రిలో తెలంగాణ పుంజులు..కోట్ల‌లో పందేలు

ఏపిలో ఎన్నిక‌ల హీట్..తెలంగాణ‌లో ఎన్నిక‌లు పూర్త‌యి సంబ‌రాల మూడ్‌. దీంతో...ఏపిలోని రాజ‌కీయ నాయకులు కోడి పందేల‌ను సైతం ప్ర‌తిష్ఠాత్మ‌కం తీసుకున్నారు. గోదావ‌రి జిల్లాల‌కు చెందిన కొంద‌రు నేత‌లు తెలంగాణ‌లోని రాజ‌కీయ ప్ర‌ముఖుల‌ను ఈ పందేల‌కు ఆహ్వానించారు. భోగి ముందు రోజే ఆదివారం మధ్యాహానికి 70 కారుల్లో తెలంగాణ ప్రాంతా నికి చెందిన వారు వచ్చారు. గడచిన ఏడాది రూ.5కోట్ల మేరకు పందేలు జరిగాయని స‌మాచారం. ఉభ‌య గోదావ‌రి జిల్లా ల్లో 250 గ్రామాల్లో పోటీల‌కు బ‌రులు గీశారు. కోడికి క‌త్తి క‌ట్టేవారిని సిద్దం చేసారు. ఒక్క హైదరాబాద్‌ నుంచే సుమారు 20 వేల మందికిపైగా జిల్లాకు చేరుకున్నట్టు సమాచారం. తూర్పు గోదావ‌రి జిల్లాలోని కోన‌సీమ లో 50కి పైగా బరులు సిద్ధం చేశారు. అమలాపురం రూరల్‌ మండలం సమనసలో పందేల కోసం వేసిన టెంట్లను పోలీసులు తొలగించారు. ఇక‌, పందేల్లో కుక్కుట శాస్త్రంపై చాలా మం ది ఆధారపడుతున్నారు. అందులోని సూత్రాల ప్ర కారం సంక్రాంతికి 6 నెలల కు ముందుగానే కోళ్లను సిద్ధం చేస్తారు. వాటితో ఈత కొట్టించ డం, జీడిపప్పు దగ్గర నుంచి మాంసం వరకు మేతగా వేసి బలీయంగా తయారు చేస్తారు. ఈ తరహా కోళ్లు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు ధర పలుకుతాయి.

త‌ల‌సానికి ఆహ్వానం..భారీగా స్వాగ‌త ఏర్పాట్లు..

త‌ల‌సానికి ఆహ్వానం..భారీగా స్వాగ‌త ఏర్పాట్లు..

ఈ సారి ఏపిలో జ‌రుగుతున్న కోడి పందేల‌కు తెలంగాణ నేత‌లు స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గా నిలుస్తున్నారు. తెలంగాణ లో ఎన్నిక‌లు పూర్తి కావ‌టంతో ఫ్రీగా ఉన్న తెలంగాణ రాజ‌కీయ ప్ర‌ముఖులు ఏపి లో కోడి పందేల వీక్ష‌ణ కోసం ప్ర‌త్యేకంగా త‌ర‌లి వ‌స్తున్నారు తెలంగాణ మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ కు గోదావ‌రి జిల్లాలోని మిత్రుల నుండి ఆహ్వా నం అందింది. ఆయ‌న హైద‌రాబాద్ నుండి కారులో విజ‌య‌వాడ చేరుకుంటారు. అక్క‌డ ఆయ‌న‌కు ఏపి యాద‌వ సంఘాలు భారీగా ఆహ్వానం ప‌లికేందుకు ఏర్పాట్లు చేసారు. క‌న‌క‌దుర్గ ద‌ర్శ‌నం చేసుకొని భీమ‌వ‌రం వెళ్తారు. అక్క‌డే మంగ‌ళ‌వారం రాత్రి వ‌రకు ఉంటారు. కోది పందేలను వీక్షించ‌టానికే స్థానిక నేత‌లు ఆయ‌న్ను ఆహ్వానించిన‌ట్లు తెలు స్తోంది. ఇప్ప‌టికే తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు దాదాపు 30 వేల మందికి పైగా ఏపికి చేరుకున్న‌ట్లు సమాచారం.

English summary
Pongal Cock Fight start in AP. In krishna and Godavari districts cock fight in peak stage. Political leaders for all parties taking participation in these cock fights. Interestingly Telangana political leaders are also taking part in these fights.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X