• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కోడి పందేలకు బరులు సిద్దం - ప్రత్యక్ష ప్రసారాలు : పాసు ఉంటేనే ప్రవేశం..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఆంక్షలు...కేసులు కోడి పందేలకు అడ్డుకోవటం లేదు. ఎక్కడా ఆగే పరిస్థితి కనిపించటం లేదు. సంక్రాంతి పండుగ మూడు రోజులపాటు పందేలు నిర్వహించేలా బరులు సిద్దం చేస్తున్నారు. పోలీసులు కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పందేలు నిరోధించడానికి చర్యలు తీసుకుంటున్నారు. అయినా ఏళ్ల తరబడి నుంచి కొనసాగుతున్న వ్యవహారం కాబట్టి పందేలు కూడా అదేస్థాయిలో నిర్వహించేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సారి కోడి పందేలులో సాంకేతిక టెక్నాలజీ వినియోగిస్తున్నారు. అంతర్జాతీయ మ్యాచ్ ల నిర్వహణ స్థాయిలో ప్రత్యక్ష ప్రసారం.. రన్నింగ్ కామెంట్రీ.. డ్రోన్లతో ఆకట్టుకొనే వీడియోలు.. ఆటగాళ్లకు గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు.

సిద్దమైన బరులు

సిద్దమైన బరులు

సంక్రాంతి పండుగ సాంప్రదాయ క్రీడలతో పాటు కోడిపందేలు దాదాపు వందేళ్లుగా జిల్లాలో కొనసాగుతున్నాయి. కోర్టు ఉత్తర్వులు, పోలీసుల ఆంక్షలు ఉన్నా పందేల జోరు స్థాయి మాత్రం తగ్గడం లేదు. ఈ ఏడాది కూడా జిల్లాలోని భీమవరం, నరసాపురం, జంగారెడ్డిగూడెం, ఉంగుటూరు, దెందులూరులో పందేల నిర్వహణకు పదుల సంఖ్యలో బరులు సిద్ధం చేస్తున్నారు.

వాస్తవానికి వారం రోజుల ముందు నుంచే కోడిపందేల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో పోలీసులు సీరియస్‌గా కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో రహస్యంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కోడిపందేలను తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తారు. పలు గ్రామాల్లో లక్షలాది రూపాయాల పందేలు జరగటం ప్రతీ ఏటా జరిగే తంతు.

కేసులు పెట్టినా.. పందేలు వైపే

కేసులు పెట్టినా.. పందేలు వైపే

పోలీసులు బైండోవర్‌ కేసులు, కోడికత్తులు స్వాధీనం చేసుకుని సాంప్రదాయ క్రీడలు నిర్వహించాలని పిలుపునిచ్చినా.. కొన్ని గంటల పాటైనా భారీగా కోడిపందేలు సాగుతుంటాయి. మరో వైపు కోవిడ్ కేసులు పెరుగుతున్నా... కోడి పందేలా నిర్వాహకులు మాత్రం లెక్క చేయటం లేదు. ప్రత్యక్షంగా రాలేని వారి కోసం..విదేశాల్లో ఉన్నా వీక్షించేందుకు వీలుగా ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయడంతోపాటు రూ.కోట్లలో బెట్టింగ్‌లకు సన్నాహాలు ఈ సారి ప్రత్యేకతగా కనిపిస్తున్నాయి.

కోనసీమలోనే 14 మండలాల్లో కనీవినీ ఎరుగని రీతిలో పందేలు ఆడించడానికి బరులు సిద్ధం చేశారు. కొబ్బరితోటల్లో ఏర్పాటు చేసిన ఒక్కో బరి కనీసం రెండెకరాలు ఉంది. మధ్యలో కోడిపందేలకు, చుట్టూ బారికేడ్లు నిర్మించారు.

ప్రత్యక్ష ప్రసారం..ఆన్ లైన్ బెట్టింగ్ లు

ప్రత్యక్ష ప్రసారం..ఆన్ లైన్ బెట్టింగ్ లు

రౌండు రౌండుకూ పందేలు జరుగుతున్న తీరు వివరించడానికి లౌడ్‌స్పీకర్లు, లైవ్‌ వీక్షించటానికి స్క్రీన్లు ఏర్పాటు చేసారు. డ్రోన్‌ కెమెరాలను సిద్దం చేసారు. పందేలకు హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలో పలు జిల్లాల నుంచి కూడా వస్తున్నారు. పాస్‌లు తీసుకున్నవారికి మినహా మరెవరికీ ప్రవేశం ఉండదు. వీఐపీ గ్యాలరీలతోపాటు సందర్శకుల గ్యాలరీని సిద్ధం చేశారు. కాకినాడ రూరల్‌, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, తుని, రామచంద్రపురం తదితర నియోజకవర్గాల్లోను భారీ బరులు సిద్ధమయ్యాయి. పందెరాయుళ్ల కోసం సకల హంగులూ సిద్ధం చేస్తున్నారు.

వీక్షించేందుకు తరలి వస్తున్నారంటూ

వీక్షించేందుకు తరలి వస్తున్నారంటూ

ఈసారి కోడిపందేలకు అనుమతి లేదని, అవి నిర్వహించే ప్రాంతాల్లో వారంకిందట పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. అయినాపందెంరాయుళ్లు ఖాతరు చేయ డం లేదు. తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 42వేల మంది జిల్లాకు చేరుకున్నట్లు సమాచారం. మరింత మంది ఇంకా రాబోతున్నారని చెబుతున్నారు.

భీమవరం, పాలకొల్లు, నరసాపురం, ఉండి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెంలలో అనేక బరులు సిద్ధమయ్యాయని తెలుస్తోంది. దీంతో..ఇక, బరిలోకి దిగే కోళ్లను సిద్దం చేసారు. దిగుమతి చేసుకోవటంతో పాటుగా.. ప్రత్యేకంగా ఫుడ్ మెనుతో వాటిని పోరాటానికి సిద్దం చేసారు. దీంతో...ఈ మూడు రోజులు కోడి పందేలు సండది చేయటం ఖాయంగా కనిపిస్తోంది.

English summary
Cock fight preparations made in godavari districts in new way. Onlilne telecast and drone visulas arranged for viewers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X