వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు రాష్ట్రాల్లో చ‌లి పంజా.. గ‌జ‌గ‌జ వ‌ణుకుతున్న జ‌నం

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ట్రోగ‌త‌లు తీవ్ర‌స్థాయిలో ప‌డిపోతున్నాయి. జ‌నం బ‌య‌ట‌కు రావ‌డానికి జంకుతున్నారు. ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు చ‌లి తీవ్రంగా ఉండ‌డంతో గ‌జ‌గ‌జ వ‌ణికిపోతున్నాయి. ఈశాన్య , వాయ‌వ్య భార‌త్ నుంచి వీస్తున్న గాలుల‌తో క‌నిష్ట, గ‌రిష్ట ఉష్ణోగ్ర‌త‌లు త‌గ్గిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌కు ప‌డిపోతున్నాయి. ద‌ట్ట‌మైన పొగ మంచుతో గిరిజ‌నులు తీవ్ర ఇబ్బంద‌లు ఎద‌ర్కొంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో చ‌లి తీవ్ర‌త

తెలుగు రాష్ట్రాల్లో చ‌లి తీవ్ర‌త

ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ వైపు ఈ ఈశాన్య , వాయవ్య భార‌త్ నుంచి గాలులు వీస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో చ‌లి తీవ్ర‌త మ‌రింత పెరుగుతంది. తెలంగాణ‌లోని ఉమ్మ‌డి ఆదిలాబాద్‌లో చ‌లితీవ్ర ఎక్కువ‌గా ఉంది. అటు ఏపీలోని విశాఖ జిల్లా, ఏజెన్సీ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోతున్నాయి. మ‌రోవైపు హైద‌రాబాద్‌లోనూ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు చ‌లిగాలులు వ‌ణుకుపుట్టిస్తున్నాయి.

హైదరాబాద్‌లో ప‌డిపోయిన ఉష్ణోగ్ర‌త‌లు

హైదరాబాద్‌లో ప‌డిపోయిన ఉష్ణోగ్ర‌త‌లు


భాగ్య‌న‌గ‌రంలో క‌నిష్ఠ ఉష్ణోగ్ర‌త‌ 18.6 డిగ్రీలుగా న‌మోదైంది. అటు రంగారెడ్డి జిల్లాలో 15.7 డిగ్రీలు, మేడ్చ‌ల్ జిల్లాలో 16.5 డిగ్రీల క‌నిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదయ్యాయి. గ‌రిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు 24 డిగ్రీల‌కు మించి ఉండ‌డం లేద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ తెలిపింది. క‌నిష్ఠ‌, గ‌రిష్ట ఉష్ణోగ్ర‌త‌ల మ‌ధ్య వ్యత్యాసం నాలుగైదు డిగ్రీల‌కు మించి దాట‌టం లేద‌ని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఈ ఉష్ణోగ్ర‌త‌లు మ‌రింత త‌గ్గే అవ‌కాశాలు ఉన్నాయని వాతావ‌ర‌ణశాఖ వెల్ల‌డించింది. గ‌తంలో ఇంత‌టి స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోవ‌డం జ‌ర‌గ‌లేదని తెలిపారు.

 చ‌లి పంజాతో వ‌ణుకుతున్న జ‌నం

చ‌లి పంజాతో వ‌ణుకుతున్న జ‌నం


తెలుగు రాష్ట్రాల్లో చ‌లి పంజా దెబ్బ‌కు ప్ర‌జ‌లు ఉద‌యం పూట ప‌నుల్లోకి వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. అసిఫాబాద్ జిల్లాలో క‌నిష్ఠ ఉష్ణోగ్ర‌త రికార్డు స్థాయిలో 10.4 డిగ్రీలకు ప‌డిపోయింది. అలాగే ఏపీలోని లంబ‌సింగి, అర‌కు ప్రాంతాల్లో కూడా క‌నిష్ఠంగా 10 డిగ్రీల ఉష్ణోగ్ర‌త న‌మోదైంది. పెద‌బ‌య‌లులో 11.5 డిగ్రీల క‌నిష్ఠ ఉష్ణోగ్ర‌తకు ప‌డిపోయింది. ఉద‌యం పూట పొగ‌మంచు ఎక్కువ‌గా కురుస్తోంది. చ‌లి తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌డంతో ప్ర‌జ‌ల రోజువారి కార్య‌క‌లాపాల‌కు అంత‌రాయం క‌లుగుతోంది. రానున్న రోజుల్లో ఏపీలోని అన్ని ప్రాంతాల్లో పొడి వాతావ‌ర‌ణం ఉండే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ప‌గ‌టి పూట గాలిలో తేమ శాతం సాధార‌ణ స్థాయి క‌న్నా 24 శాతం వ‌రకూ పెరుగుతుంద‌ని పేర్కొన్నారు. అటు హిందూ మ‌హాస‌ముద్రం, శ్రీలంక ప‌రిస‌ర ప్రాంతాల‌ల్లో ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం ఏర్పడింద‌ని దీని ప్ర‌భావంతో మ‌రో రెండు రోజుల్లో అల్ప‌పీడ‌నం ఏర్ప‌నుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది.

మ‌రోవైపు క‌రోనా కొత్త‌వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తున్న వేళ ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచిస్తున్నారు వైద్యులు. వాతావ‌రణంలో మార్పులు కార‌ణంగా అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంద‌న్నారు. తీవ్ర‌మైన చ‌లిగాలుల కార‌ణంగా శ‌ర‌రీంలో ఉష్ణోగ్ర‌త‌లు త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు.

English summary
Cold intensity in AP and Telangana, Temparatures are dropping in telugu States.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X