హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వణికిపోతున్నారు- 50 ఏళ్ల తరువాత రికార్డు స్థాయిలో : వైరస్ వ్యాపిస్తున్న వేళ- ప్రభుత్వాల హెచ్చరికలు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చలి వణికిస్తోంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో చతి తీవ్ర ఎక్కువగా ఉంటోంది. రెండు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో కనీస ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు చేరాయి. హైదరాబాద్ నగరంలో చలి పంజా విసురుతోంది. విజయవాడ నగరంలోని ఇదే పరిస్థితి. మునుపెన్నడూ లేనివిధంగా నగరంలో కొద్దిరోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విజయవాడలో బుధవారం తెల్లవారుజామున 13 డిగ్రీల కనిష్ణ ఉష్ణోగ్రత నమోదైంది. 50 ఏళ్ల తరువాత విజయవాడలో నమోదైన అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత ఇదేనని వాతావరణశాఖ చెబుతోంది.

వణుకుతున్న హైదరాబాద్ - విజయవాడ

వణుకుతున్న హైదరాబాద్ - విజయవాడ


ఈ నెల 14వ తేదీ నుంచి నగరంలో 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది. పదిరోజులుగా విశాఖ, తిరుపతి నగరాల కంటే విజయవాడలోనే ఎక్కువ చలి వాతావరణం ఉంటోంది. చింతపల్లి 7.2, అరకు లో 3.2, పాడేరులో 11, మినుములూరులో 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. దట్టమైన పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నాయి. కొమురంభీం జిల్లా గిన్నెదరిలో 7 డిగ్రీలు, సిర్పూర్‌లో 7.6 డిగ్రీలు, ఆదిలాబాద్‌ జిల్లా సోనాలలో 7.2, ఆర్లి(టి)లో 7.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. విజయవాడలో బుధవారం తెల్లవారుజామున 13 డిగ్రీల కనిష్ణ ఉష్ణోగ్రత నమోదైంది.

50 ఏళ్ల తరువాత అత్యంత కనిష్ణంగా

50 ఏళ్ల తరువాత అత్యంత కనిష్ణంగా

50 ఏళ్ల తరువాత విజయవాడలో నమోదైన అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత ఇదేనని వాతావరణశాఖ చెబుతోంది. ఈ నెల 14వ తేదీ నుంచి నగరంలో 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది. పదిరోజులుగా విశాఖ, తిరుపతి నగరాల కంటే విజయవాడలోనే ఎక్కువ చలి వాతావరణం ఉంటోంది. రాబోయే రెండురోజులు చలి ఇంకా పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. విశాఖ జిల్లా జి.మాడుగులలో అత్యల్పంగా 5.4 డిగ్రీల కనిష్ణ ఉష్ణోగ్రత నమోదైంది. పెదబయలులో 5.7, ముంచంగిపుట్టులో 6.3, డుంబ్రిగూడలో 6.8, అరకు వ్యాలీలో 7, గుంటూరులో 15.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మరో వైపు పెరుగుతున్న వైరస్

మరో వైపు పెరుగుతున్న వైరస్

మధ్య భారతదేశం నుంచి చల్లటిగాలులు నేరుగా ఏపీ వైపు వీస్తుండడంతో చలి తీవ్రత పెరిగింది. ఇదే సమయంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. పండుగ సీజన్ మొదలైంది. దీంతో..ప్రభుత్వాలు పదే పదే సూచనలు చేస్తున్నాయి. అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాయి. మాస్కులు ఖచ్చితంగా వినియోగించాలని సూచిస్తున్నాయి. ఏపీలో ఇప్పటికే రెండు ఒమిక్రాన్ కేసులు నిర్దారించారు. తాజాగా తెలంగాణలో ఒక్క రోజే 14 ఒమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం రాష్ట్రంలో న‌మోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 38కి చేరింది.

ప్రభుత్వాల అప్రమత్తం

ప్రభుత్వాల అప్రమత్తం

ఎట్ రిస్క్ దేశాల నుంచి వ‌చ్చిన 14 మందికి క‌రోనా నిర్ధార‌ణ జ‌రిగిన‌ట్టు వైద్య ఆరోగ్య‌శాఖ తెలియ‌జేసింది. కేసులు పెరిగిపోతుండ‌టంతో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం అయింది. ఈ రోజు ప్రధాని మోదీ ఒమిక్రాన్ కేసుల పెరుగుదల పైన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. ఇక, చలి గాలులు బలంగా వీస్తున్న ఈ సమయంలో ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

English summary
Cold intesity increased across both teugu states, minimum temparatures recorded in many parts of the TS and AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X