అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏడేళ్ల తర్వాత పరిటాల విగ్రహం, చంద్రబాబు నాకో విషయం చెప్పారు: శ్రీరామ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

అనంతపురం: అనంతపురం జిల్లాలోని వెంకటాపురంలో పరిటాల రవి విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు ఆవిష్కరించారు. ఏడేళ్ల తర్వాత ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ హాజరయ్యారు.

అంతకుముందు, రామగిరి మండలం వెంకటాపురంలోని తిరుమల దేవరగుడి ఆలయంలో సామూహిక వివాహ వేడుకల్లో పరిటాల శ్రీరామ్, పరిటాల సునీత పాల్గొన్నారు. సామూహిక వివాహాల్లో 250 మంది దంపతులు ఒక్కటయ్యారు. దీనికి చంద్రబాబు హాజరైన వధూవరులను ఆశీర్వదించారు.

పెళ్లిపై పరిటాల శ్రీరామ్ ఏమన్నారు: 2019 ఎన్నికలే టార్గెట్?పెళ్లిపై పరిటాల శ్రీరామ్ ఏమన్నారు: 2019 ఎన్నికలే టార్గెట్?

Collective marrages under Paritala trust

ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడారు. తనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ విషయం చెప్పారని, నా పేరు గొప్పగా చెప్పుకున్నా, చెప్పుకోకపోయినా తన తండ్రి పేరు మాత్రం నిలబెట్టాలని సూచించారని తెలిపారు. శ్రీరామ్ వ్యాఖ్యలకు అక్కడి జనాలు జేజేలు పలికారు.

English summary
Collective marriages under Paritala trust on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X