సత్యంబాబుకు ఉద్యోగం, ఇల్లు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో నిర్దోషిగా విడుదలైన సత్యంబాబు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో కృష్ణా జిల్లా కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా తనకు జీవనాధారం కల్పించాలని కలెక్టర్‌ను.
కృష్ణా: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో నిర్దోషిగా విడుదలైన సత్యంబాబు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో కృష్ణా జిల్లా కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా తనకు జీవనాధారం కల్పించాలని కలెక్టర్‌ను కోరారు.
తన సోదరికి కూడా ఏఎన్ఎం ఉద్యోగం ఇప్పించాలని అడిగారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సత్యంబాబుకు తాత్కాలిక ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సత్యం సోదరిని కూడా తాత్కాలిక పద్ధతిలో నియమిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

అందుకు సంబంధించిన ఆదేశాలను కలెక్టర్ జారీ చేశారు. సత్యం బాబు ఇల్లు కాలిపోవడంతో పక్కా గృహం మంజూరు చేశారు కలెక్టర్. ఆయేషా మీరా హత్య కేసులో 8 ఏళ్లపాటు జైలు శిక్ష అనుభవించిన సత్యం బాబును హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో ఇటీవలే విడుదల అయిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications