Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబు ఆదేశాలు, తిరుపతి, చిత్తూరు కలెక్టర్లకు ఆ బాధ్యతలు, రికార్డులు ఉన్నాయా ?

అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో దుండగులు రికార్డులు కాల్చిన ఘటనపై మంగళవారం రాష్ట్ర రెవెన్యూ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సిసోడియా మదనపల్లెకు వెళ్లి ఈ ఘటనపై లోతుగా విచారించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయవాడలోని అధికారులు ఒక్కొక్కరు మదనపల్లె చేరుకుని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై లోతుగా విచారణ చేస్తున్నారు.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్ మదనపల్లె చేరుకుని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై దర్యాప్తు జరిపి వివరాలు సేకరించారు. ఈ క్రమంలోనే చిత్తూరు, తిరుపతి కలెక్టర్లు సుమిత్‌కుమార్‌, వెంకటేశ్వర్లు కూడా మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి సిసోడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై ఇద్దరు కలెక్టర్లకు సిసోడియా కీలక విచారణ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.

Collectors of Tirupati and Chittoor districts have new responsibilities over Madanapalle fire

చిత్తూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లు ఇద్దరూ తమకు అప్పగించిన బాధ్యతల్ని అమలు చేయడం ప్రారంభించినట్లు సమాచారం. జిల్లాల విభనజకు ముందు చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, కుప్పం, పలమనేరు నియోజకవర్గాలు మదనపల్లె రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఉండేవి. దీంతో పుంగనూరు నియోజకవర్గ రికార్డులు ఇంకా మదనపల్లె సబ్‌ కలెక్టరేట్‌లో ఉండే అవకాశాలున్నాయని సమాచారం.

జిల్లాల విభజన తరువాత పుంగనూరు, కుప్పం, పలమనేరు అసెంబ్లీ నియోజక వర్గాలు చిత్తూరులో కలిశాయి. అప్పటి చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె అసెంబ్లీ నియోజక వర్గాలు అన్నమయ్య జిల్లాలో కలిశాయి. మదనపల్లెను జిల్లా కేంద్రం కాకుండా అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డితో పాటు అప్పటి మదనపల్లె వైసీపీ ఎమ్మెల్యే అడ్డుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.

మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని, మదనపల్లెలో సబ్ కలెక్టర్ కార్యాలయం, డీస్పీ బంగ్లా, ఎంతో పేరు ఉన్న బీటీ కాలేజ్, ఎమ్మార్వో, ఎంపీడీఓ కార్యాలయాలు ఉన్నాయని, ఎలాంటి సదుపాయాలు లేని రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించకూడాదని ఇదే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు సుమారు నెల రోజులకు పైగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు చేశారు.

Collectors of Tirupati and Chittoor districts have new responsibilities over Madanapalle fire
గత ఐదేళ్లలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కుటుంబం అనేక ప్రాంతాల్లో భూఅక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో మంగళవారం పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి ఇంట్లో అధికారుల సోదాలు చేసి రెండు సంచుల రికార్డులు స్వాధీనం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో కాలిపోయిన రికార్డులకు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకూ లింకు ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఉమ్మడి చిత్తూరు జిల్లా మూడు ముక్కలు అయ్యి ఇప్పుడు చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లా (మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు నియోజక వర్గాలు కలుపుకుని)గా ఏర్పాడు, కుప్పం, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, తంబళ్లపల్లె, పీలేరు అసెంబ్లీ నియోజక వర్గాలకు చెందిన ప్రభుత్వ భూములు, వివాదాస్పద భూముల పత్రాలతో పాటు ప్రభుత్వ శాఖలకు చెందిన పలు కీలకమైన డాక్యూమెంట్లు అన్నీ మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే ఉన్నాయని రెవెన్యూ శాఖ అధికారులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+