త్వరలోనే పవన్ కల్యాణ్ నన్ను పిలుస్తారు: అలీ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ప్రముఖ కమెడియన్ అలీ మంచి స్నేహితులన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని వారిద్దరూ బహిరంగంగా చాలాసార్లు చెప్పారు. పవన్ కల్యాణ్ నటించే ప్రతి సినిమాలోను అలీకి కచ్చితంగా ఒక పాత్ర ఉంటుంది. కథ ప్రకారం కామెడీ పాత్ర లేకపోయినప్పటికీ అలీ కోసం పాత్రను సృష్టించిన సందర్భాలున్నాయి.

అవకాశం ఉంటే కచ్చితంగా పిలుస్తారు!
కానీ ఇటీవల విడుదలైన వకీల్ సాబ్, భీమ్లానాయక్ చిత్రాల్లో అలీ నటించలేదు. తాజాగా ఒక సినిమా ప్రమోషన్ లో భాగంగా అలీ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు పై విషయాలపై స్పందించారు. అంతేకాకుండా 'ఈటీవీ'లో తాను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'అలీతో సరదాగా' కార్యక్రమానికి పవన్ ఎప్పుడు వస్తారు? అనేదానికి కూడా ఆయన సమాధానం ఇచ్చారు. వకీల్ సాబ్, భీమ్లానాయక్ చిత్రాలు రెండూ సీరియస్ సినిమాలని, అందులో హాస్యానికి అవకాశం లేదన్నారు. తానే కాదని, అసలు ఏ హాస్యనటుడు కూడా ఆ రెండు సినిమాల్లో నటించలేదనే విషయాన్ని గుర్తుచేశారు. త్వరలో చేయబోయే పవన్ కల్యాణ్ సినిమాల్లో హాస్యం ఉంటే కచ్చితంగా తనను పిలుస్తారనే ఆశాభావాన్ని అలీ వ్యక్తం చేశారు.

పవన్ బిజీగా ఉన్నారు!
'అలీతో సరదా'గా కార్యక్రమాల్లో బాలసుబ్రమణ్యంతో చేసిన ఎపిసోడ్ తనకు ఇష్టమన్నారు. ఆయన మరణించినప్పుడు తట్టుకోలేకపోయాయన్నారు. వీవీ వినాయక్, పూరీ జగన్నాథ్, అల్లు అరవింద్ ఎపిసోడ్లు తనకు నచ్చాయన్నారు. పవన్ కల్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి కచ్చితంగా వస్తారని, తనతో వస్తానని కూడా చెప్పారన్నారు. ప్రస్తుతం పవన్ చాలా బిజీగా ఉన్నారని, ఆయన 'ఫ్రీ' అయినప్పుడు వస్తారన్నారు.

ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీ
పవన్ కల్యాణ్ జనసేన పార్టీద్వారా ఏపీలో అధికార పక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై పోరాటం చేస్తున్నారు. తాజాగా అలీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవిని ప్రభుత్వం కట్టబెట్టింది. అయితే తన స్నేహితుడు పవన్ ముఖ్యమంత్రి జగన్ పై పోరాటం చేస్తున్న క్రమంలో గతంలో జనసేనలో చేరతారంటూ వార్తలు వచ్చినప్పటికీ అనూహ్యంగా ఆయన వైసీపీలో చేరారు. ఎన్నికల సమయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. అప్పటి నుంచి పవన్, అలీ మధ్య దూరం పెరిగినట్లు సినీ విశ్లేషకులు భావిస్తుంటారు.












Click it and Unblock the Notifications