జగన్‌ను అలా కలిశానే తప్ప!: పవన్ కళ్యాణ్‌తో అలీ సుదీర్ఘ భేటీ, వీడని సస్పెన్స్
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో ప్రముఖ సినీ నటుడు, కమెడియన్ అలీ ఆదివారం భేటీ అయ్యారు. సుమారు రెండు గంటల పాటు వారి భేటీ జరిగింది. నటుడు అలీ జనసేనతోనే ఉంటాడని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అలాగే, అలీ రాజకీయ భవిష్యత్తుకు అండగా ఉంటానని జనసేనాని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని తెలుస్తోంది.
చదవండి: 'దేవుడి'కి దూరం: పవన్ కళ్యాణ్‌ను వదిలివెళ్తున్న సన్నిహితులు, నిన్న ఒకరు, రేపు మరొకరు!
పార్టీలో చేరే అంశంపై త్వరలో తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని అలీ జనసేనానితో చెప్పారని తెలుస్తోంది. ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌ను కలిసిన అంశంపై కూడా జనసేనానికి అలీ వివరణ ఇచ్చారని తెలుస్తోంది.

జగన్‌ను విమానాశ్రయంలో కలిశారే తప్ప.. వీడని సస్పెన్స్
వైయస్ జగన్మోహన్ రెడ్డిని కమెడియన్ అలీ విమానాశ్రయంలో కలిశారే తప్ప వైసీపీలో చేరిక ఉండదని జనసేన వర్గాలు చెబుతున్నాయని తెలుస్తోంది. అదే విషయమై అలీ.. జనసేనానికి తెలిపారని అంటున్నారట. అయితే అధికారికంగా నటుడు అలీ లేదా జనసేన వర్గాలు లేదా వైసీపీ వర్గాలు వెల్లడించకపోవడంతో వైసీపీలో ఆయన చేరికపై సస్పెన్స్ వీడటం లేదు. విజయవాడలోని పవన్ కళ్యాణ్ నివాసంలో అలీ కలిశారు.

వైసీపీలో చేరుతారని ప్రచారం
నటుడు అలీ ఈ నెల 9వ తేదీన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోన్న విషయం తెలిసిందే. ఓ వైపు జనసేన పార్టీ నిర్మాణంపై దృష్టి సారించడం, రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతుండటం, పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని జనసేనాని చెబుతుండగా, మరోవైపు అతనిని బాగా ఆరాధించేవారు లేదా ఇష్టపడేవారు సన్నిహితులుగా ఉన్నవారు ఇతర పార్టీల్లో చేరడం చర్చనీయాంశంగా మారింది.

పవన్ సన్నిహితుడు అలీ వైసీపీలో చేరడమా?
ఇప్పటికే సినీ నిర్మాత బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరోవైపు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అలీ కూడా త్వరలో వైసీపీలో చేరుతారని, ఆయన రాజమండ్రి నుంచి పోటీ చేస్తారని రెండు రోజులుగా ప్రచారం సాగుతోంది. ఇది తీవ్ర కలకలం రేపుతోంది. పవన్‌కు ఎంతో సన్నిహితంగా ఉండే అలీ వైసీపీలో చేరడం ఏమిటనే చర్చ సాగుతోంది. అలీ వైసీపీలో చేరుతారనే ప్రచారంపై పవన్ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రంగానే స్పందించారు.












Click it and Unblock the Notifications