వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యస్! సభలో రోజా, కొడాలి తీరు బాగాలేదు! ఫ్యాబ్రికేటెడ్: శ్రీకాంత్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యురాలు, నటి రోజా భవితవ్యంపై శుక్రవారం నాడు అసెంబ్లీ కమిటీ నిజనిర్ధారణ కమిటీ తేల్చింది!

గత అసెంబ్లీ సమావేశాల్లో సభాపతి కోడెల శివప్రసాద్ సహా ముఖ్యమంత్రి చంద్రబాబు, అధికార పార్టీ సభ్యులపై ఘాటు వ్యాఖ్యలు చేసిన రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు పడింది. అయితే తన సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధమని వాదిస్తున్న రోజా హైకోర్టుకు ఎక్కారు.

Also Read: రోజాకు షాక్: సస్పెన్షన్‌పై స్టేకు హైకోర్టు నిరాకరణ

ఈ క్రమంలో ఈ విషయంపై మరింత లోతుగా దర్యాప్తు సాగించేందుకే ప్రభుత్వం మొగ్గుచూపింది. అంతేకాక మహిళా సభ్యురాలిగా ఉంటూ అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన రోజాపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని అధికార పార్టీ ఎమ్మెల్యేలు కోరుతున్నారు.

Committee meet in Hyderabad on Roja's suspension

ఈ క్రమంలో ప్రభుత్వం నియమించిన నిజనిర్ధారణ కమిటీ శుక్రవారం హైదరాబాద్‌లోని అసెంబ్లీలో మరోసారి సమావేశమైంది. ఈ సందర్భంగా నాటి అసెంబ్లీ సమావేశాల వీడియోలను కమిటీ పరిశీలించారు.

ఆ వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించాక రోజా వ్యవహారంపై కమిటీ ప్రభుత్వానికి ఓ నివేదికను అందిస్తుంది. ఈ నివేదిక ఆధారంగా రోజా సస్పెన్షన్ కాల పరిమితిని కుదించాలా? పొడిగించాలా? లేక రద్దు చేయాలా? అన్న విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటంది. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

రోజా, నాని ప్రవర్తన సరిగా లేదని తేల్చిన నిజ నిర్ధారణ కమిటీ

వీడియోలను పరిశీలించిన నిజనిర్ధారణ కమిటీ రోజా, కొడాలి నాని ప్రవర్తన సరిగా లేదని తేల్చింది. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కాగా, ఈ కమిటీ నివేదికను ఎథిక్స్ కమిటీకి పంపించనున్నారు. దానిని సభా హక్కుల కమిటీ ముందు పెడతారు. సభా హక్కుల ముందు కమిటీకి అందరు సభ్యులు హాజరయ్యే అవకాశముంది.

వైసిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం

తమ పార్టీకి చెందిన రోజా, కొడాలి నానిల లిప్ మూమెంట్ ఆధారంగా వీడియోలు తయారు చేశారని వైసిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి శుక్రవారం ఆరోపించారు. రోజా, కొడాలి నానిల ప్రవర్తనను నిజ నిర్ధారణ కమిటీ తప్పు పట్టిన విషయం తెలిసిందే.

దీనిపై శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్యేలపై డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ రూపొందించిన కమిటీపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీపై బురద జల్లేందుకే ఈ కమిటీ నివేదిక రూపొందించారని నిజ నిర్ధారణ కమిటీలో సభ్యుడిగా ఉన్న శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

కమిటీ నివేదికను వ్యతిరేకిస్తూ డిసెంట్ నోటీసు ఇచ్చానని మీడియాకు తెలిపారు. తప్పుడు వీడియోలను విడుదల చేసి కొంతమందిపై ప్రభుత్వం బురద జల్లాలని ప్రయత్నిస్తోందని కమిటీకి చెప్పానన్నారు. రోజా సస్పెన్షన్ పై ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని, ఫ్యాబ్రికేటెడ్ వీడియోలను విడుదల చేశారని ఆరోపించారు.

మంత్రి అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు, బుచ్చయ్య చౌదరి, బోండా ఉమ దారుణంగా మాట్లాడినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపానన్నారు. టిడిపి సభ్యుల తీరుపై నివేదికలో పొందుపర్చాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ కమిటీ నివేదికను ఎథిక్స్ కమిటీకి పంపించనున్నారు. దానిని సభా హక్కుల కమిటీ ముందు పెడతారు. సభా హక్కుల ముందు కమిటీకి అందరు సభ్యులు హాజరయ్యే అవకాశముంది.

English summary
Committee meet in Hyderabad on YSR Congress Party Roja's suspension.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X