కామన్‌వెల్త్: విశాఖకు వీఐపీల వెల్లువ (ఫోటోలు)
విశాఖపట్నం: కామన్‌వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పార్లమెంటు, ది మీడియా లా కాన్ఫరెన్స్ సదస్సు బుధవారం ఉదయం విశాఖలో ప్రారంభమైంది. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్రమంత్రి వెంకయ్య, సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల సహా 10 దేశాలు, 20 రాష్ర్టాల నుంచి 200 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు.
విశాఖలో కామన్‌వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 8 నుంచి జరగనున్న మూడు రోజుల విదేశీ ప్రతినిధుల సదస్సులో పాల్గొనేందుకు పలువురు విదేశీ ప్రతినిధులు నగరానికి చేరుకున్నారు. వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు నగర అందాలను తిలకించడంతో పాటు ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తున్నారు.
అందులో భాగంగా సోమవారం సింహాచలం దేవస్తాన్నాన్ని సందర్శించి సింహాద్రి అప్పన్న దర్శనం చేసుకున్నారు. నార్తన్ టెర్రిటరీకి చెందిన రాబిన్‌లాంబ్లె, సౌత్ ఆస్ట్రేలియాకు చెందిన రసెల్ వొర్‌ట్లే, మల్లాకు చెందిన గౌడ్ ఫ్రే ఫెర్గూసన్, గర్నసీకు చెందిన మైఖేల్ హాడ్లీ, సిపిఎ ప్రతినిధి బస్సెట్, డబ్ల్యుబిజి నుంచి మిరియం బెన్‌స్కీ వచ్చారు.
లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. పార్లమెంట్ అండ్ ది మీడియా లా కాన్ఫరెన్స్ పేరుతో జరగనున్న ఈ సదస్సుకు రాష్ట్ర శాసనసభా స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షత వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో సిపిఎ నాలుగుసార్లు ఇటువంటి సమావేశాలను నిర్వహించింది. రాష్ట్ర విభజన తరువాత తొలి సమావేశం ఆంధ్ర ప్రదేశ్‌లో జరుగుతోంది. విశాఖ నగరం ఈ సమావేశానికి ఆతిథ్యమిస్తోంది.

విశాఖకు వెల్లువెత్తుతున్న వీఐపీలు
స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకొబోతున్న విశాఖపట్నానికి వీఐపీలు వెల్లువెత్తుతున్నారు. విశాఖలో కామన్‌వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 8 నుంచి జరగనున్న మూడు రోజుల విదేశీ ప్రతినిధుల సదస్సులో పాల్గొనేందుకు పలువురు విదేశీ ప్రతినిధులు నగరానికి చేరుకున్నారు.

విశాఖకు వెల్లువెత్తుతున్న వీఐపీలు
వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు నగర అందాలను తిలకించడంతో పాటు ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తున్నారు.అందులో భాగంగా సోమవారం సింహాచలం దేవస్తాన్నాన్ని సందర్శించి సింహాద్రి అప్పన్న దర్శనం చేసుకున్నారు.

విశాఖకు వెల్లువెత్తుతున్న వీఐపీలు
నార్తన్ టెర్రిటరీకి చెందిన రాబిన్‌లాంబ్లె, సౌత్ ఆస్ట్రేలియాకు చెందిన రసెల్ వొర్‌ట్లే, మల్లాకు చెందిన గౌడ్ ఫ్రే ఫెర్గూసన్, గర్నసీకు చెందిన మైఖేల్ హాడ్లీ, సిపిఎ ప్రతినిధి బస్సెట్, డబ్ల్యుబిజి నుంచి మిరియం బెన్‌స్కీ వచ్చారు.

విశాఖకు వెల్లువెత్తుతున్న వీఐపీలు
బుధవారం ఉదయం 8.50 గంటలకు ఈ సదస్సు ప్రారంభమవుతుంది. ఈ సదసుకు హాజరైన అతిథులకు రాష్ట్ర శాసనసభా కార్యదర్శి కె సత్యనారాయణ స్వాగతం పలుకుతారు. తొమ్మిది గంటల నుంచి 9.15 వరకూ రాష్ట్ర శాసనసభా స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్వాగతోపన్యాసం చేస్తారు.

విశాఖకు వెల్లువెత్తుతున్న వీఐపీలు
9.15 నుంచి 9.25 గంటల వరకూ కామన్‌వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు, ఎంపి ప్రేమ్ దాస్ రాయ్, 9.25 నుంచి 9.35 వరకూ లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ డాక్టర్ తంబుదురై మునుస్వామి, 9.35 నుంచి 9.50 గంటల వరకూ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రసంగిస్తారు.

విశాఖకు వెల్లువెత్తుతున్న వీఐపీలు
9.50 నుంచి 10.05 గంటల వరకూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, 10.05 నుంచి 10.20 గంటల వరకూ లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ ప్రసంగిస్తారు.

విశాఖకు వెల్లువెత్తుతున్న వీఐపీలు
రాష్ట్ర శాసనమండలి చైర్మన్ ఎ చక్రపాణి సభికులకు ధన్యవాదాలు తెలియచేస్తారు. ఆ తరువాత ఈ సమావేశానికి హాజరైన ప్రతినిధులందరూ గ్రూప్ ఫొటో దిగుతారు.

విశాఖకు వెల్లువెత్తుతున్న వీఐపీలు
11.30 గంటలకు ది సిపిఎ అండ్ పార్లమెంట్ అండ్ ది మీడియా అనే అంశంపై కామన్‌వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ప్రోగ్రాం అసిస్టెంట్ డైరక్టర్ ఆర్లెన్ బుస్టీ ప్రసంగిస్తారు.

విశాఖకు వెల్లువెత్తుతున్న వీఐపీలు
12 గంటలకు ది రోల్ ఆఫ్ ది మీడియా యాజ్ ది ఫోర్త్ ఎస్టేట్ అనే అంశంపై చీఫ్ ఎడిటోరియల్ అండ్ కంటెంట్ ఆఫీసర్ నిక్ దవేస్ (హిందుస్థాన్ టైమ్స్), చంద్రశేఖర్, అభిషేక్ కందేకర్ ప్రసంగిస్తారు.

విశాఖకు వెల్లువెత్తుతున్న వీఐపీలు
మధ్యాహ్నం రెండు గంటలకు పార్లమెంట్ అండ్ ది మీడియా-లీగల్ ఫ్రేమ్‌వర్క్ అనే అంశంపై ఎంపి ప్రదీప్ సింహ, నిక్ దవేస్, బ్రిటిష్ కొలంబియా క్లర్క్ కర్జ్ జేమ్స్, డబ్ల్యుబిజి రిసోర్స్ పర్సన్ చంద్రశేఖర్ ప్రసంగిస్తారు.

విశాఖకు వెల్లువెత్తుతున్న వీఐపీలు
3.30 గంటలకు పార్లమెంట్ అండ్ ది మీడియా వర్కింగ్ గ్రూప్స్ అనే అంశంపై చర్చా గోష్ఠి ఉంటుంది. ఏడు గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, ఎనిమిది గంటలకు కైలాసగిరిపై సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి.












Click it and Unblock the Notifications