కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కడప సెగ: కేంద్రమంత్రి కారును అడ్డుకున్న సీమ నేతలు, బూటు విసిరిన మహిళ

|
Google Oneindia TeluguNews

కడప: కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డేకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేదు అనుభవం ఎదురైంది. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ నేతలు శనివారం అడ్డుకున్నారు.

కడప ఆర్అండ్‌బీ అతిథి గృహం వద్ద మంత్రి అనంతకుమార్ హెగ్డే కారు ముందు ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులు కారును చుట్టుముట్టడంతో మంత్రి అనంతకుమార్ కదలకుండా కారు లోపలే ఉండిపోయారు.

Communist party leaders stopped central Minister Ananth Kumar Hegdes Vehicle

కాగా, కడపలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేస్తూ.. కారును ముందుకెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వీరిని లాగి పక్కకు పడేశారు. ఆ తర్వాత కారు ముందుకు కదిలింది.

ఈ క్రమంలో అనంతకుమార్ కారు ఆగకుండా వెళ్లిపోవడంపై ఆగ్రహించిన ఓ మహిళా కార్యకర్త మంత్రి కారు వైపు బూటును విసిరింది. అప్పటికే ఆ కారు అక్కడ్నుంచి వెళ్లిపోయింది.

English summary
Communist party leaders stopped central Minister Ananth Kumar Hegde's Vehicle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X