• search
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పవన్ సమరశంఖం పూరించాడు, కమ్యూనిస్టులు కన్నెర్ర చేశారు!

By Suvarnaraju
|

విజయవాడ:2019 ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకింత ముందుగానే సమర శంఖం పూరించేశాడు. అంతేకాదు రెండు తెలుగురాష్ట్రాల్లోనూ తమ పార్టీ బరిలోకి దిగబోతున్నట్లు కూడా పవన్ క్లారిటీ ఇచ్చేశాడు.

చదవండి: 175 స్థానాల్లో పోటీ: పవన్, జనసేన వ్యూహకర్తగా దేవ్ నియామకం, 'అధికారంలోకి వస్తాం'

అంతటితో ఆగలేదు ఏపీలో 175 స్థానాల్లోనూ పోటీ చేయనున్నట్లు ప్రకటించేశాడు. ఇక తెలంగాణలో పోటీకి సంబంధించి విధి విధానాల మీద ఆగస్టు తర్వాత స్పష్టత ఇస్తామన్నారు. అంతేకాదు అనూహ్యంగా జనసేన పార్టీ రాజకీయ వ్యూహకర్తగా దేవ్ ను నియమిస్తున్నట్లు కూడా ప్రకటించేశారు పవన్ కల్యాణ్. ఇవీ 2019 ఎన్నికల కోసం తాను ఏ రకంగా సమాయత్తమవుతున్నాడో తెలియజెప్పిన ప్రకటనలు. అయితే పవన్ కళ్యాణ్ మిగిలిన ప్రకటనల గురించి ఏమీ పట్టింపు లేదు కానీ ఒక అనౌన్స్ మెంట్ మాత్రం వామపక్ష నేతలకు తీవ్ర ఆగ్రహం తెప్పించిందట. అదేమిటంటే?...

 కుల పార్టీ, జనసేన పంథా, 2014 పోటీ.. వీటన్నింటికి పవన్ దిమ్మతిరిగే సమాధానాలు!

 ఆ ప్రకటన...ఎపిలో 175 స్థానాల్లో...

ఆ ప్రకటన...ఎపిలో 175 స్థానాల్లో...

ఆంధ్రప్రదేశ్ లో 175 స్థానాల్లో తమ జనసేన పార్టీ పోటీచేయనున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడం ఎపి కమ్యూనిస్ట్ నేతలను ఖంగు తినిపించిందట. కారణం ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే నిమిత్తమే వామపక్ష నేతలు పవన్ కళ్యాణ్ తో కలసి ప్రత్యేక హోదా కోసం పోరాటంతో సహా వివిధ ఆందోళనల్లో కలసి పాల్గొనడం, ఉమ్మడి కార్యాచరణ ప్రకటించడం జరుగుతూ వచ్చిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ ప్రతి విషయంలోనూ మూడు సమావేశాలు ఆరు సంప్రదింపులు చందంగా సాగిన వీరి మైత్రి ఇటీవల విజయవాడలో జరిగిన పాదయాత్రతో మరింత ప్రస్పుటమైందని అందరూ భావించారు. ఇలాంటి తరుణంలో పవన్ ఉన్నట్లుండి ఏకపక్షంగా ఎపిలోని 175 స్థానాల్లో తమ పార్టీ పోటీ చేయబోతున్నట్లు ప్రకటించడం వారికి ఏ మాత్రం మింగుడు పడక పోగా తీవ్ర మనస్థాపానికి గురి చేసినట్లు తెలుస్తోంది.

 పవన్ ప్రకటన...కారణం ఏంటి?...

పవన్ ప్రకటన...కారణం ఏంటి?...

వామపక్షాల బాటే తనదేనని ప్రకటించిన పవన్ కళ్యాణ్, నిన్నటిదాకా తమతో కలసిమెలసి తిరిగిన జనసేనాని ఇలా ఉన్నట్టుండి తమకు తెలియకుండానే ఎన్నికల సమరశంఖం పూరించేయడం...అంతేకాదు తాము ఏదైతే ఆశలు పెట్టుకున్నామో వాటి మీద నీళ్లు జల్లుతూ ఏకంగా ఏకపక్షంగా ఆంధ్రాలో తాము అన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లు పవన్ ప్రకటించడం వారిని నివ్వెరపరిచినట్లు సమాచారం.

పవన్ ఎందుకిలా చేశారు..కావాలనేనా?

పవన్ ఎందుకిలా చేశారు..కావాలనేనా?

అయితే పవన్ కళ్యాణ్ ప్రకటన ఇటు వామపక్ష నేతలనే కాదు రాజకీయ పరిశీలకుల్ని సైతం ఆశ్చర్యపరిచిందని చెప్పుకోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ హఠాత్తుగా ఎందుకిలా చేశారు...అంటే పవన్ ప్రకటించింది...మాటవరసకేనా?..అంటే 175 స్థానాలకు పోటీ చేసేప్పుడు కమ్యూనిస్టులు కోరిన సంఖ్యలో సీట్లు అడ్జస్ట్ చేయడం పెద్ద కష్టం కాదనే కారణంతో వారిని కూడా దృష్టిలో పెట్టుకొనే ఆ ప్రకటన చేశారా? లేక వామపక్షాలను వదిలించుకునే ఉద్దేశ్యంతో ఇలా పొమ్మనలేక పొగ బెట్టినట్లు చేశారా!...తాను ముందే ఇలా ప్రకటించేస్తే వామపక్షాలు మనస్థాపానికి గురై వాళ్లంతట వారే దూరమవ్వచ్చని భావించారా? లేక ఇలా ప్రకటించడం ద్వారా ఎక్కువ సీట్ల కోసం వారు ఒత్తిడి చేయకుండా ఉంటారని ఈ ఎత్తుగడ అవలంభించి ఉంటారా?...అనే సందేహాలు రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తం అయ్యాయి.

ఒక వేళ ఇది పవన్ మార్క్...టిట్ ఫర్ టాటా!

ఒక వేళ ఇది పవన్ మార్క్...టిట్ ఫర్ టాటా!

లేక గతంలో తనను సంప్రదించకుండా అంతరంగిక సమావేశాల తాలూకూ సారాంశంతో కూడిన ప్రకటనలను వామపక్ష నేతలు పలు సందర్భాల్లో బయట
పెట్టినందుకు ప్రతిగా పవన్ ఈసారి ఈ కీలకమైన విషయాల గురించి వారితో చర్చిస్తే మళ్లీ అవి వారి ద్వారానే ముందే బైటకు వచ్చేస్తాయని భావించి టిట్ ఫర్ టాట్ లా తానే ముందుగా ప్రకటించేశారా?...అనేది కూడా సందేహించాల్సిన విషయమేనంటున్నారు రాజకీయ పరిశీలకులు. కారణం ఏదైనా తమతో ఇప్పటిదాకా అంటకాగి ఇప్పుడు కనీసం తమతో మాట మాత్రం చెప్పకుండా ఎపిలోని 175 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించడంపై వామపక్షాల్లో ఆగ్రహం రగిలించిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

కమ్యూనిస్టుల కన్నెర్ర...దేనికంటే

కమ్యూనిస్టుల కన్నెర్ర...దేనికంటే

తమతో కలసి ప్రజా పోరాటాలు చేస్తూ తమ పార్టీ కేడర్ ని కూడా జనసేన పార్టీ నిర్మాణానికి వినియోగించుకుంటూ తమ పోరాట పంథా ద్వారా పాఠాలు నేర్చుకుంటూ చివరకు ఎన్నికల విషయం వచ్చేసరికి తమను పక్కన బెడతారా అంటూ కమ్యూనిస్టులు కన్నెర్ర చేసినట్లు తెలిసింది. గతంలో తమతో కలసి ప్రకటనలు చేసిన పవన్ ఎన్నికల ప్రకటన విషయం వచ్చేసరికి తమను పక్కనబెట్టేసి కేవలం మాదాసు గంగాధరం, వ్యూహకర్త దేవ్ తో మాత్రమే మీడియా సమావేశంలో పాల్గోవడం, పవన్ ప్రకటనల్లో ఎక్కడా మాటవరసకు కూడా కమ్యూనిస్టుల ప్రస్తావనగాని, వామపక్షాల కూటమి అనే మాటగాని వినిపించకపోవడం వారిని తీవ్ర మనస్థాపానికి గురిచేసిందట. గతంలో అన్ని రాజకీయ పార్టీల్లాగానే చివరకు పవన్ కూడా తమను కూరలో కరివేపాకులా వాడి పక్కన పడేసినట్లు ప్రవర్తించడం వారికి చాలా బాధ కలిగించినట్లు తెలుస్తోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

విజయవాడ యుద్ధ క్షేత్రం
జనాభా గణాంకాలు
జనాభా
21,28,486
జనాభా
 • గ్రామీణ ప్రాంతం
  42.72%
  గ్రామీణ ప్రాంతం
 • పట్టణ ప్రాంతం
  57.28%
  పట్టణ ప్రాంతం
 • ఎస్సీ
  18.45%
  ఎస్సీ
 • ఎస్టీ
  3.77%
  ఎస్టీ

English summary
Pawan Kalyan's announcement that his Jana sena party will contest in 175 seats in Andhra Pradesh was angered the Communist Parties.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more