పవన్ ను గెలిపించాలని పెళ్లి శుభలేఖలో కోరిన అభిమాని-ఈసీకి ఫిర్యాదు
ఏపీలో ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓటమిపాలైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం బరిలోకి దిగడంతో అక్కడ ఏం జరగబోతోందన్న ఉత్కంఠ ప్రతీ ఒక్కరిలోనూ నెలకొంది. అలాగే పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అభిమానులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పవన్ ను ఈసారి ఎలాగైనా గెలిపించుకోవాలని ఫిక్స్ అయిన వారంతా.. ఇప్పుడు వివిధ రూపాల్లో ఆయన విజయం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ విజయం కోసం ఓటేయాలని కోరుతూ ఓ అభిమాని చేసిన ప్రయత్నం ఇప్పుడు వివాదానికి కారణమైంది. పిఠాపురంలో పవన్ అభిమాని వీరబాబు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ పెళ్లికి తన బంధువర్గం, మిత్రుల్ని ఆహ్వానించేందుకు తయారు చేసిన శుభలేఖను విన్నూత్నంగా ఉండాలనుకున్నాడు. ముఖ్యంగా తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ విజయం కోసం ఓటేయాలని వారందరినీ కోరాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగగా శుభలేఖలో పవన్ కు ఓటేయాలని కోరాడు.

ఇది కాస్తా పవన్ కు ప్రత్యర్ధిగా పోటీ చేస్తున్న జై భీమ్ భారత్ పార్టీ అభ్యర్ధి మల్లిఖార్జునకు కంటగింపుగా మారింది. దీంతో అతను సదరు పవన్ కళ్యాణ్ అభిమాని వీరబాబు చేసిన పనిపై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశాడు. ముందస్తు అనుమతి లేకుండా ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిన వీరబాబుతో పాటు వారించని జనసేన పార్టీపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తున్నది చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications