Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమరావతి ఉద్యమంలో చంద్రబాబుకు ఎంతో సహకరించినా.. హ్యాండిచ్చాడు

YS Sharmila: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్- వామపక్షాలు ఏకతాటిపైకి వచ్చాయి. ఉమ్మడిగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనాలని నిర్ణయించాయి. ఏపీ కాంగ్రెస్‌తో కలిసి వామపక్ష పార్టీలు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్నాయి.

మొన్నటివరకు వామపక్ష పార్టీలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచిన విషయం తెలిసిందే. అమరావతి రైతుల ఉద్యమంలో చంద్రబాబు చేసిన పోరాటానికి మద్దతు పలికాయి సీపీఐ, సీపీఎం సహా ఇతర వామపక్ష పార్టీలు. టీడీపీ నేతలతో కలిసి రోడ్డెక్కాయి. ఉద్యమంలో భాగస్వామ్యులయ్యాయి.

Congress alliance with Left Parties in Andhra Pradesh

ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో- చంద్రబాబు మాత్రం భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం విశ్వప్రయత్నాలు సాగిస్తోన్నారు. ఇప్పటికే జనసేన సహకారాన్ని తీసుకుంటోన్నారు. టీడీపీ-జనసేన కూటమిలోకి బీజేపీని కూడా చేర్చడానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్.. సర్వశక్తులు ఒడ్డుతున్నారు. బీజేపీతో టీడీపీ పొత్తు కుదురిందంటూ వార్తలు వస్తోన్నాయి గానీ.. అధికారికంగా బీజేపీ నేతలెవరూ దీన్ని ప్రకటించట్లేదు.

ఈ పరిణామాలతో వామపక్ష పార్టీలు.. టీడీపీకి దూరం కావాల్సి వచ్చింది. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు తహతహలాడుతున్నాడని, అమరావతి ఉద్యమంలో అండగా నిలిచి- ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన తమకు ఆయన గుణపాఠం చెప్పారనే అభిప్రాయం వామపక్ష నేతల్లో వ్యక్తమౌతోంది.

ఈ పరిస్థితుల్లో వాళ్లు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. ఇదివరకే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిలతో చర్చలు జరిపారు. అవి కొలిక్కి వచ్చాయి. వామపక్షాలతో కలిసి ఎన్నికలకు వెళ్తామని షర్మిల స్వయంగా వెల్లడించారు.

Congress alliance with Left Parties in Andhra Pradesh

సీపీఎం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎంఎ గఫూర్, వెంకటేశ్వరరావు, శ్రీనివాస రావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, జల్లి విల్సన్.. తదితరులు విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో షర్మిలను కలిశారు. పొత్తులు, సీట్ల పంపకాలపై చర్చించారు. దీనిపై వారి మధ్య ఏకాభిప్రాయం కుదిరింది.

అనంతరం షర్మిల.. విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 26వ తేదీన అనంతపురంలలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్వహించబోయే బహిరంగసభకు వామపక్ష నేతలను ఆహ్వానిస్తున్నామని అన్నారు. కొండలాంటి పార్టీని ఎదుర్కొనడానికి కలిసి పోరాడాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ తిరుపతి వెంకటేశ్వరుడి సాక్షిగా ఇచ్చిన హామీని రామభక్తులమని చెప్పుకొంటోన్న బీజేపీ నేతలు తుంగలో తొక్కారని విమర్శిొంచారుె. వైసీపీ, టీడీపీలు బీజేపీకి బానిసలని అభివర్ణించారు. ఈ రెండు పార్టీలు కూడా బీజేపీకి తొత్తులుగా మారాయని, రాష్ట్ర హక్కులను పణంగా పెట్టాయని మండిపడ్డారు.

రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల కోసం పోరాడేది తామేనని షర్మిల చెప్పారు. తమ రాజకీయ ప్రయాణంలో భాగంగా వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటున్నామని ప్రకటించారు. కలిసి పోరాడే అంశాలపై చర్చించామని, ఉమ్మడిగా పోరాటాలు సాగిస్తామని పేర్కొన్నారు. సీట్ల పంపకాలపై త్వరలోనే స్పష్టత వస్తుందని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+